Friday, March 16, 2012

సోషల్‌నెట్ వర్కింగ్ లో సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలంటే..

14/03/2012  ఆంధ్రభూమి - భూమికలో     - డా. సాయి అయితిక  పేరుతో వచ్చిన వ్యాసం ఇది.....
 
సోషల్‌నెట్ వర్కింగ్ అంటే గుర్తొచ్చింది. ఈమధ్య ఒకాయన ఫోన్ చేశాడు మరో మిత్రుడి పేరు రెఫరెన్సుతో. సోషల్ గేదరింగ్, గేమ్స్, ప్రోగ్రామ్స్ అంటూ మొదలెట్టాడు కబుర్లు. ఇదేదో కంట్రీ క్లబ్బు బాపతుగా ఉందనుకొని, సారూ! మీ ప్రోగ్రామ్ ఏమిటో మెయిల్ చేయండి. నాకు నచ్చితే చేరతానన్నా. చిటికెలో మెయిల్ వచ్చింది. సోషలైజేషన్ పేరుతో అదో వ్యాపారం. ఐదుమంది సభ్యులు చేరితే 25 వేలు కట్టాలి. ఒక ఫ్యామిలీ (నలుగురు)కైతే ఏడాదికి 5 వేలు కట్టాలి. నెలనెలా కల్చరల్ ప్రోగ్రాముల పేరిట గేదరింగ్‌ట. ఈ కల్చరేమిటో! చూస్తే.. అన్నీ సిన్మా డాన్సులూ, పాటల ప్రోగ్రామ్సూనట. అయ్యా! నేనొక రాంగ్ నెంబర్ దీనికి! అంటూ తిరుగు టపా పెట్టానంతే! ఆ సోషలైజేషన్ అక్కడితో ఆగిపోయింది. ఇదెందుకు చెప్పాల్సివచ్చిందీ అనంటే, సోషల్ నెట్‌వర్కింగ్‌లో ఎన్నో కానె్సప్టులున్నాయి. నెట్‌వర్క్ ఏదైనా పదిమందీ కలిపి సమాచారాన్ని పంచుకోవడమే అసలు సంగతి. అయినా ఆ విషయాన్ని బట్టి ఈ సమాచారాన్ని పంచుకోవడం అనేది పలు రకాలుగా ఉంటోంది.


మొన్నమొన్నటిదాకా బ్లాగింగ్, వీడియో షేరింగ్ అనేవి వేర్వేరుగా ఉండేవి. ఐతే, విశే్లషకులు ఇపుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లే రైటు! అంటున్నారు. ఎందుకంటే, సమాచారం పంచుకునే విధానాలన్నిటినీ తమలో ఇమిడ్చేసుకుంటున్నాయ ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు. వీటిలో నిత్యమూ జరిగే యాక్టివిటీస్‌లో చాటింగ్, మెసేజింగ్, బ్లాగింగ్, ఆర్‌ఎస్‌ఎస్ ఫీడింగ్, ఫైల్ షేరింగ్, పాడ్ కాస్టింగ్, వ్యాడ్ కాస్టింగ్, సోషల్‌బుక్ మార్కింగ్, ఫోరమ్స్, గ్రూప్స్‌లో యాక్టివిటీస్ లాంటివి కొన్ని.

చాటింగ్ అనేది మనందరికీ తెల్సిన సంగతే. ఇందులో టెక్ట్స్ చాట్, వాయిస్ ఛాట్, వీడియో చాట్ ఇవన్నీ మనకు తెలిసిన పద్ధతులే. మెసెంజర్ సాఫ్ట్‌వేర్‌ల ద్వారా ఇవన్నీ మనం ఎపుడో వాడడం మొదలెట్టాం. ఇపుడు మెసెంజర్‌తో చేసే పనులన్నిటిలో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోనే చేసేయగల్గడం ఒక విశేషం. ఇక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో మెసేజీలు రెండురకాలుగా పంపుకోవచ్చు. ఒకటి అందరికీ పంపగల్గడం (పబ్లిక్) రెండోది కేవలం మనం ఎంపిక చేసుకున్న (గ్రూపు) సభ్యులకే పంపడం (ప్రైవేట్). కొన్ని సైట్లలో ఎస్సెమ్మెస్‌లను పంపే వీలు కూడా ఉంది. బ్లాగ్‌ల ఉద్ధృతి ఏమీ తగ్గలేదనేది మనకు తెల్సిందే. ఎందుకంటే, బ్లాగుల్లో సవివరంగా మనం పెట్టిన వ్యాసాలూ, అనుభవాలూ, వ్యాఖ్యానాలూ లింక్ చేయగల్గడం సోషల్ నెట్‌వర్క్‌ల ప్రత్యేకత. మనకునచ్చిన సమాచారాన్ని నిత్యం పోస్ట్ చేసే మన బ్లాగులన్నీ అలా సోషల్ నెట్‌వర్క్‌లో వుండే మనమిత్రులందరికీ అందుబాటులో ఉంచడం చాలా సులభం. అప్‌డేట్ జరిగినపుడల్లా ఆర్‌ఎస్‌ఎస్ ఫీడ్‌లద్వారాగానీ, నేరుగా సైట్‌లో మెసేజీ ద్వారాగానీ మిత్రులకు తెలియజేయడం చాలా ఈజీ.
సాధారణంగా ఫోరమ్‌లలో, టారెంట్‌లద్వారా, లేకుంటే ఫైల్ షేరింగ్ సైట్లద్వారా ఫైల్స్ ఇచ్చిపుచ్చుకోవడం పాత పద్ధతి. ఇపుడు అవన్నీ సోషల్ నెట్ వర్కింగ్‌లో సాధ్యమే. అసలు ఫైల్ షేరింగ్ కోసమే కూడా కొన్ని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లున్నాయంటే ఆశ్చర్యం కల్గకమానదు. వీటిలో ఫొటో షేరింగ్, వీడియోషేరింగ్, మ్యూజిక్ షేరింగ్‌లను ప్రధానంగా చెప్పుకోవాల్సి వుంటుంది. ఫ్లికర్ లాటి సైట్సే కాదు, యూట్యూబ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు.

మ్యూజిక్ ఐపాడ్ లాటివాటిని అప్‌డేట్ చేయడానికి వీలుగా మ్యూజిక్ బ్రాడ్‌కాస్ట్ చేయడాన్ని పాడ్ కాస్టింగ్

అంటారు. అలాగే వీఢియోలను అప్‌డేట్ చేసే వీలునిచ్చేదాన్ని వాడ్ కాస్టింగ్ అంటారు. ఈ రెంఢు ప్రక్రియలూ కూడా సోషల్ నెట్‌వర్కింగ్‌లో అంతర్భాగాలైపోయాయి.
మనకునచ్చిన ఫేవరెట్‌సైట్ల పేర్లను దాచుకొంటే, మళ్లీ మళ్ళీ సులభంగా చూసుకోవడానికి వీలవుతుంది. సాధారణంగా బ్రౌజర్‌లలో   సేవ్ చేసుకుంటాం. ఐతే, మనం వేరే ప్రదేశానికి వెళ్లినపుడు (లాప్‌టాప్ అయితేసరే గానీ డెస్క్ టాప్ ఐతే కుదరదు కదా) అవి అందుబాటులో ఉండవు. అడ్రస్ గుర్తులేకపోతే కష్టమే. అలా అందుబాటులో ఉండాలీ అంటే, వాటిని ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఆనక  ఫైలు మార్చి నెట్‌లో ఎక్కడో దాచుకోవాలి. ఐతే ఇది పాత పద్ధతి. ఆ తర్వాత కొద్ది రోజులకి మనకా ఇబ్బంది తప్పింది. మన ఫేవరెట్ సైట్స్ జబితాను ఎప్పటికపుడు ఆన్‌లైన్‌లో దాచుకొనే వీలునిచ్చే ఆన్‌లైన్ బుక్ మార్కింగ్ సౌకర్యం అందించే సైట్లు వెలిసాయి. ఐతే ఇపుడు సోషల్ బుక్ మార్కింగ్ పద్ధతి దీనిని మరింత ముందుకు తీసుకుపోయింది. అదేంటంటే, ఆన్‌లైన్‌గా మనం సేవ్ చేసుకునే ఫేవరెట్లను ఎప్పటికప్పుడు క్రోడీకరించి సూచించడానికి మనం వాడే పదాలను (టాగ్స్) అందరికీ అందుబాటులో ఉంచే ప్రక్రియ. దీనికి సోషల్ బుక్ మార్కింగ్ అని పేరు పెట్టారు. దీనివల్ల అత్యధికుల ఫేవరెట్ సైట్స్ ఏవో తెలుసుకునే వీలు ఏర్పడింది. మనకు తెలీని పాపులర్ సైట్లను తెలుసుకునే వీలూ ఏర్పడింది. డిగ్స్ , ఢెలిషియస్, స్టంబల్ అపాన్  - ఇవన్నీ ఆ కోవకు చెందినవే. ఐతే మన వ్యక్తిగత సమాచారం తెలీకుండానే ఈ ఫేవరెట్స్‌ను మనం దాచుకోవచ్చు.
కొన్ని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఫోరమ్స్‌కూడా అంతర్భాగమైపోయాయి. అలాగే ఒకే అభిరుచి ఉండే వారంతా ఒక గ్రూపుగా ఏర్పడటమూ సాధ్యమే. సినీ అభిమానులు, ద్వేషులూ, ఒకే బిజినెస్‌పై ఆసక్తి ఉండేవాళ్ళు, ఒకే భాష / ప్రాంతం వాళ్ళు- ఇలా పలు గ్రూపులుగా ఏర్పడటం జరుగుతోంది.

No comments:

Post a Comment