బద్ధకం బద్ధకం... ఎలాగో వదిలించా.
ఆంధ్రభూమి దిన పత్రికలో వస్తూన్న నా వ్యాసాల పరంపర కొనసాగుతూంది. దాదాపు 41 వారాలుగా ఐటి లోకం శీర్షికన రాస్తున్నా. దాంతో బాటు భూమికలో కూడా రాస్తున్నా, అదే బుధవారమే. కొన్ని కవర్ స్టోరీలూ రాశా.
మచ్చుకి ఒకటి......

భూప్రపంచం @ ఇంటర్‌నెట్
డా.వి.వి.వేంకటరమణ
May 15th, 2011
ఇంటర్నెట్! మానవజాతి జీవన విధానాన్ని మార్చేసిన అంతర్జాలం! చిన్నదిగా భవనాలకే పరిమితమైన కంప్యూటర్ నెట్‌వర్క్ ఆ తర్వాత సంస్థాగత నెట్‌వర్క్‌గా, రాష్ట్రాల నెట్‌వర్క్‌గా, దేశపు నెట్‌వర్క్‌గా- అంచెలంచెలుగా ఎదిగింది. ప్రపంచాన్ని ‘క్లిక్’ దూరంలో ఉంచి, ఒక కుగ్రామంగా మార్చేసింది. ఈ సంవత్సరం మార్చి 13నాటికి ఇంటర్నెట్ ఆవిర్భవించి 22 ఏళ్ళు పూర్తి అయ్యింది. ప్రపంచంలో ఉండే అన్ని కంప్యూటర్ నెట్‌వర్క్‌లనూ ఒకే త్రాటిపై తెచ్చి వాటిలో ఉండే సమాచారాన్ని పంచుకోడానికి వీలుకలిగించాల్సిన ఈ నెట్‌వర్క్ ప్రజల, సంస్థల పని సౌలభ్యానికి కూడా కారణమైంది. అలా ప్రపంచ ప్రజల కనీసావసరాల్లో ఒకటిగా మారిపోతున్న ఇంటర్ నెట్ కట్ అయతే పరిస్థితి ఎలా వుంటుంది..అసలు ఇంటర్‌నెట్ ముందువెనుకలేమిటి?
పది పదిహేను ఏళ్ళ క్రితం ఉత్తరాలు/ సమాచారం అందుకోవడంలో సుదీర్ఘమైన నిరీక్షణ తప్పనిసరైపోయేది. ఇంటర్నెట్ వచ్చాక అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నారుూ అంటే ఆశ్చర్యం కాదు. నేడు ఇమెయిల్ అడ్రస్ లేని వాడు వెర్రివెంగళాయి కింద లెక్క!
ఇంటర్నెట్ అనేది అందరికీ తప్పనిసరి వారధిగా మారిపోయింది. ఈ 22 ఏళ్ళలో ప్రజల జీవనశైలినీ మార్చివేసి, మానవాళిని శాసించే స్థాయికి ఎదిగింది ఇంటర్నెట్. ఆన్‌లైన్‌లో లావాదేవీలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నాయి. ఇకామర్స్, ఇగవర్నెన్స్ ప్రక్రియల వల్ల అంతా ‘ఆన్‌లైన్’గా జరిగిపోతున్నాయి. విమానం, బస్సు, రైలు రిజర్వేషన్లు, వివిధ రకాల బిల్లులు, పన్నుల చెల్లింపులన్నీ ఇంట్లో కూర్చునే చెల్లించేయగల్గుతున్నాం. బ్యాంకులకు వెళ్ళకుండానే, ఇంట్లో కూచొనే లావాదేవీలు జరుపుకొంటున్నాం కూడా. ఆన్‌లైన్‌లో విద్యగరపడం, వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు అందించే కోర్సులు, వాటి వివరాలు, ప్రవేశాలు, పరీక్షలు - ఇలా ఎన్నో ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా అందుకోగల్గుతున్నాం.
చిన్న భవనాంతర్గత కంప్యూటర్ నెట్‌వర్క్‌గా ఆరంభమై, సంస్థాపరమైన, రాష్ట్ర, దేశవ్యాప్త నెట్‌వర్క్‌లుగా ఎదిగి, రూపాంతరం చెంది, అలాటి నెట్‌వర్క్‌లకే నెట్‌వర్క్‌గా ఇంటర్నెట్ విశ్వజనీయమైన నెట్‌వర్క్‌గా రూపొందింది. ఇంటర్నెట్ ఆవిర్భావంలో ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన సమాచార విప్లవమే వచ్చిందని చెప్పాలి. అది ప్రపంచాన్ని వినూత్నమైన పోకడలతో ఒక్క ఊపుఊపేసింది. ప్రపంచం ఒక కుగ్రామమై పోయింది.
అణుబాంబును వాడినా, కమ్యూనికేషన్స్ వ్యవస్థ విచ్ఛిన్నమైనా ఈ ఇంటర్నెట్ వ్యవస్థ మాత్రం ఏమాత్రం విచ్ఛిన్నంకాకుండా ఉండేలా చూడాలనేది అలనాటి ఆలోచన. కొన్ని వెబ్‌సైట్స్ పనే్జయడం మానేసినా ఇంటర్నెట్ కమ్యూనికేషన్ వ్యవస్థ మాత్రం పనిచేస్తూ ఉంటే చాలు. అన్నీ సవ్యంగా జరిగిపోతాయనే భావనతో కంప్యూటర్ శాస్తజ్ఞ్రులు, ఇంజనీర్లు, విద్యావేత్తలు, లైబ్రేరియన్లు - వారి అవసరాలూ దృష్టిలో పెట్టుకొని ఇంటర్నెట్ రూపుదిద్దుకొంది. ఐతే, తొలినాటి ఇంటర్నెట్ నేడు మనం వాడుతూన్నంత యూజర్ ఫ్రెండ్‌లీగా ఉండేదే కాదు.
1972లో ఆర్పానెట్‌లో రేటామ్లిన్‌సన్‌బ గుర్తుని, యూజర్ నేమ్‌నీ అడ్రస్‌కు జోడించే దానికి గుర్తుగా వాడి ఇమెయిల్ సౌకర్యాన్ని తెచ్చాడు. ఒక కంప్యూటర్ నించీ మరో కంప్యూటర్‌లోకి వెళ్ళి పనిచేసుకొనే టెలినెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి వచ్చిందీ 1972లోనే. 1973లో ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ (ఎఫ్‌టిపి) సౌకర్యంతో ఒక కంప్యూటర్ నించి మరో కంప్యూటర్‌లోకి ఫైల్స్‌ను అప్‌లోడ్/ డౌన్‌లోడ్ చేసే సౌకర్యం వచ్చింది.
1970 ప్రాంతాల్లోనే ఇంగ్లాండ్, మధ్య అట్లాంటిక్, దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో వగైరా ప్రాంతాల్లోని ప్రాంతీయ లైబ్రరీ కన్సార్షియంలు నెట్‌వర్కింగ్ కోసం చేతులు కలిపాయి. ఐతే 1981లో బిట్‌నెట్ అనే ఐబిఎం సంస్థ రూపొందించిన నెట్‌వర్క్ వాడుకలోకి రావడంవల్ల గేట్‌వేలు, ఇమెయిల్ వాడకం మొదలయ్యాయి. 1986లో అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ 56 కెబిపిఎస్ వేగంతో పనిచేసే ఇంటర్నెట్ బ్యాక్‌బోన్ వ్యవస్థకై ఆర్థిక సాయం అందించింది. 1990 ప్రాంతంలో యూనివర్సిటీ ఆఫ్ సాస్కబిన్‌కి చెందిన పీటర్ స్కాట్ లైబ్రరీలకు సంబంధించి Hytelnet అనే కాటలాగ్‌ను ప్రవేశపెట్టాడు. (ఇదే 1997నాటికిFHywebcat అనే వెబ్ ఆథారిత కేటలాగుగా రూపాంతరం చెందింది). 1991లో తొలి, నిజమైన యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్నెట్ ఇంటర్‌ఫేస్ మినె్నసోటా యూనివర్సిటీ రూపొందించింది. 1989నాటికే టిమ్‌బెర్నర్స్‌లీ బృందం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సిద్ధాంతాలను రూపొందించి వాటిని ఆచరణలోకి

తెచ్చే దిశగా పనిచేయనారంభించింది. 1991నాటి వాటిని అమలులోకి తేగలిగారు.
1992లో డెల్ఫి అనే తొలి వాణిజ్య, వ్యాపారాత్మక ఇంటర్నెట్ సేవలు అమెరికాలో ఆరంభమైంది. 1995 మేనాటికి ఇంటర్నెట్- వ్యాపారపరమైన పరిమితులు- అపోహలూ- అన్నీ తొలగిపోయాయి. అమెరికాలో ఎఓఎల్, ప్రొడిజీ, కంప్యూసర్వ్ లాటివన్నీ ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. ఇండియాలో 1994లోనే తొలిసారిగా ఇంటర్నెట్ ప్రభుత్వ రంగ కార్యాలయాలకు అందుబాటులోకి వచ్చింది. దీనికి ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ కీలకపాత్ర వహించింది. ఆ తర్వాతే వివిధ ప్రవేటు సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ వాడకం విస్తృతం కావడంతో వెబ్ డిజైనింగ్, డాట్‌కామ్‌లు- కొత్త వ్యాపార అవకాశాలనీ తెచ్చాయి. ఇంటర్నెట్ అనేది మధ్యతరగతి లోగిలిలో తప్పనిసరి మాధ్యమం అయిపోయింది. మొబైల్ ఇంటర్నెట్ తాజా పరిణామం. నేడు అమెరికాలో చిన్నపాటి వ్యాపారం సైతం ఇంటర్నెట్ ఆధారంగానే పనిచేస్తోంది. నేడు 71% స్మాల్ బిజినెస్‌లో ఇంటర్నెట్ తప్పనిసరియైపోయింది.
కాలక్రమంలో ఎనె్నన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. జరుగుతున్నాయి. విజ్ఞానం, వినోదం, వాణిజ్యం, వ్యాపారం- ఇలా అన్ని రంగాల్లో తనవంతు పాత్రను పోషిస్తోంది. వెబ్ మ్యూజిక్, వెబ్ టీవీ, వెబ్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ కామర్స్, వెబ్ మ్యాగజైన్స్, ఇ గవర్నెన్స్, టెలికాన్ఫరెన్సింగ్, విడియో కాన్ఫరెన్సింగ్, ఐపి ఫోన్, ఐపి విడియోఫోన్, వెబ్ చాటింగ్, మెసేజింగ్, విడియో చాటింగ్- ఇలా ఎనె్నన్నో..
ఇంటర్నెట్ వచ్చాక మన జీవన శైలి మారింది. పెను తుఫానులాటి మార్పులొచ్చాయి. నాడు సమాచారంకోసం నెలల తరబడి వేచి వుండాల్సివచ్చేది. కానీ నేడో? వౌస్ క్లిక్‌తో అన్నీ ప్రత్యక్షం అవుతున్నాయి. ఇషాపింగ్ సౌకర్యాలు, సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లు, బ్యాంకింగ్ పోర్టల్స్, ఇ బుక్‌షాప్స్, ఆర్కీవ్‌లూ- ఇలా ఎన్నో విలక్షణ సౌకర్యాలొచ్చాయి. 2000నాటికి ప్రపంచంలో బ్రాడ్‌బ్యాంక్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడం, 2002నాటి వెబ్ లాగ్స్ లేదా బ్లాగ్స్ అందుబాటులోకి రావడంతో జనాలు ఎక్కడ ఇంటర్నెట్‌పై ఆధారపడటం ఎక్కువైపోయింది. వికీపీడియా లాటి విజ్ఞాన సర్వస్వాలూ, యూట్యూబ్‌లాటి వుచిత విడియో పోర్టల్స్ హిట్ అవడంతో, మన దేశంలో ఎన్నో టీవీ ఛానెల్సూ ఇంటర్నెట్‌లో తమ కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చాయి. దాదాపు అన్ని తెలుగు న్యూస్ ఛానెల్సూ నెట్‌లో చూడవచ్చు. అన్ని పత్రికలూ నెట్‌లో చదువుకోవచ్చు.
2009 నాటికి ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ యూసర్లుగా చైనీయులు ప్రథమ స్థానాన్ని, అమెరికన్లు రెండో స్థానాన్నీ, జపానీయులు మూడో స్థానాన్నీ, మనవాళ్ళు నాలుగో స్థానాన్నీ సంపాదించుకొన్నారు. 2009లో వెలువడిన ఒక అంచనా ప్రకారం ఈ 2011 అంతానికి జూపిటర్ రిసెర్చి పరిశోధనల ఫలితాల ప్రకారం ఈ భూమి మీద 22% ప్రజలు ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేస్తారట. ఉత్తర అమెరికా 2011 అంతానికి ఆన్‌లైన్ యాక్సెసింగ్‌లో టాప్ స్థాయికి చేరుకొంటుందనీ అంచనా వేశారు. ఆసియాలో 2011 అంతానికి దాదాపు 42% ఇంటర్నెట్ మీదే ఆధారపడనున్నారనీ నాటి అంచనాలు చెబుతున్నాయి.

2009 మధ్యకాలంనాటికి విశ్వవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం కూడా ఏమీ తక్కువకాదు. ఏభై వేల కోట్ల గిగా బైట్ల పైమాటే. ఇక 2011కి ఇది ఎంతుంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అసలు ఏభైవేల కోట్ల గిగాబైట్లే అనుకుంటే కూడా ప్రపంచంలో ప్రతి ఇద్దరిలో ఒక్కరికి హైయిడ్ ఐపాడ్ ఉంటే, వాటన్నిటినీ పూర్తిగా నిలిపేయగల్గినంత సమాచానం అన్నమాట.
సోషల్ నెట్‌వర్కింగ్, ఇమెయిల్, మొబైల్ ఇంటర్నెట్- ఇవన్నీ ఇతోధికంగా పెరిగిపోవడం వల్ల డిజిటల్ సమాచారం ఎన్నో రెట్లు పెరిగిపోతోంది. ఈ డిజిటల్ సమాచారాన్ని ముద్రించి పుస్తక రూపం తెస్తే, ఆ పుస్తకాలను ఒక దానిపై ఒకటి వరసగా పేర్చుకొంటూ పోతే భూమినించీ ప్లూటోదాకా పది వరసల్లో పేర్చవచ్చంటారు విశే్లషకులు. మొత్తం డిజిటల్ డేటాను నిక్షిప్తం చేసి దాచుకోడానికి అవసరమయ్యే వనరుల విలువ కూడా అరవై వేల కోట్ల డాలర్ల పైమాటే. వీటికితోడు విజ్ఞానం, వినోదం, వైద్యం వంటి రంగాల్లోని డేటాను సమాచారాన్నీ కూడా కలుపుకొంటే అయ్యే ఖర్చు దీనికన్నా రెండు రెట్లు పైమాటే నంటున్నారు విశేషజ్ఞులు. వర్చువల్ విశ్వవిద్యాలయాలు నెలకొంటున్నాయి. ఇలెర్నింగ్ సెంటర్లొస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే, పరిపాలనలో ప్రభుత్వాలు సాధారణ కంప్యూటరీకరణాస్థాయిని అధిగమించి ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ లేదా ఇగవర్నెన్స్ ప్రక్రియను చేపట్టాయి. దీనికీ ఇంటర్నెట్టే ప్రాతిపదిక కావడం విశేషంగా చెప్పుకోవాలి. ఇ గవర్నెన్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్యవారధిగా నిలిచింది ఇగవర్నెన్స్ అది కాస్త మొబైల్స్‌లోకీ విస్తరించి మొబైల్ గవర్నెన్స్ దాకా ఎదుగుతోంది. స్మార్ట్ గవర్నెన్స్‌కు ప్రతీకగా నిలిచింది. ఇమెయిల్ నించి ఇగవర్నెన్స్ దాకా ఇలా ఇంటర్నెట్ విస్తరించిందీ అంటే, ఎంత అత్యవసరమైన, కీలకమైన వనరైందో ఇట్టే తెలుస్తోంది. దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ ఆన్‌లైన్‌లో సేవలు లభిస్తూన్నారుూ అంటే ఆశ్చర్యం లేదు. వీటిని పల్లెపల్లెనా, వాడవాడలా విస్తరించే ప్రయత్నంలో సమీకృత సేవా కేంద్రాలు (లేదా కామన్ సర్వీస్ సెంటర్స్) ఏర్పాటుచేస్తోంది భారత ప్రభుత్వం. దీంతో ఇంటర్నెట్ సేవలన్నీ పల్లెముంగిట లభింపజేయడమే అంతిమ లక్ష్యం!
ఇంత చారిత్రాత్మక నేపథ్యంలో ఇంటర్నెట్- సారీ! అంతర్జాలం మహేంద్రజాలాన్ని చవిచూపిస్తూ మానవ జీవన సరళిలో వెనె్నముకలా మారిపోతోంది. స్మార్ట్ హౌస్‌లనూ ఇంటర్నెట్ మీదే పర్యవేక్షించే రోజులూ దగ్గర్లో వున్నాయి. అంటే, మనం ఇల్లు తాళంవేసి ఆఫీసులోనో, వేరో ఊర్లోనో ఉన్నాసరే, ఇంటర్నెట్ మాధ్యమంగా ‘స్మార్ట్ హౌస్’ పరిజ్ఞానంతో సదా పర్యవేక్షించుకోవచ్చు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో అందరికీ అందుబాటులో ఉందీ సౌకర్యం. ఇపుడిపుడే మన దేశంలోనూ వేళ్లూనుతోంది.
ఇలా ఉంటే, ఒకరోజు...
అమలాపురంలో రామారావ్ తన కంప్యూటర్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా కనెక్టయ్యి ఆరోజు న్యూస్‌పేపరు చూడ్డానికి ఉపక్రమించాడు. మోడెమ్ పనే్జస్తోంది. కనెక్ట్ అవడానికి యూసర్ ఐడి, పాస్‌వర్డ్ కరెక్టుగానే ఇచ్చాడు. కానీ ఎంతటికీ కనెక్ట్ కాలేదు. కనెక్షన్ ఫెయిల్ అయ్యిందని మెసేజి వచ్చింది. ఏం చేయాలో దిక్కుతోచలేదు. బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్‌కి ఫోన్‌చేసినా ఫలితం లేకపోయింది!
అమెరికాలో రాజేష్, వర్క్‌ఫ్రమ్ హోమ్ కింద ఆ రోజు పనిచేయడానికి ఉపక్రమించాడు. ప్చ్! ఎంతసేపటికీ ఇంటర్నెట్ కనెక్ట్ కాలేదు. ఫలితంగా ఆఫీసుకు బయల్దేరాడు. ఇంగ్లాండ్‌లో పుష్ప! అర్జెంటుగా ఇండియాకు రావాలని ఫోన్ వస్తే, ఫ్లైట్ టికెట్ బుక్ చేద్దామని ఇంటర్నెట్‌లో ఏర్‌లైన్స్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసి టికెట్ బుక్ చేయాలని రెండు గంటలుగా ట్రై చేస్తోంది! లాభం లేదు. ఇక నేరుగా ఏర్‌పోర్ట్‌కే వెళ్ళింది. అక్కడా టికెట్ దొరకలేదు. కారణం ఇంటర్నెట్ పనే్జయడం లేదు. యూత్ ‘చాటింగ్’ చేయలేక పిచ్చెక్కిపోతున్నారు.
శర్మ తన ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ద్వారా అర్జెంటుగా వాళ్ళబ్బాయి అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ప్చ్! కుదరడంలేదు. విసుగొచ్చి నేరుగా బ్యాంక్‌కెళ్ళాడు. అక్కడ పరిస్థితి ఇంకో రకంగా ఉంది. దినవారీ లావాదేవీల ప్రక్రియ బ్రాంచి దాకా కూడా సజావుగా జరగడం లేదు!

కారణం? కంప్యూటర్ నెట్‌వర్క్ ఇంటర్నెట్‌లు పనే్జయడం లేదు.
బ్యాంకుల ఏటిఎంలూ పనే్చయడం లేదు. శాటిలైట్ వ్యవస్థ బాగానే వుంది. బ్యాంకుల కంప్యూటర్లూ బాగానే పనే్జస్తున్నాయి. కానీ ప్రధాన కార్యాలయంతో వివిధ బ్రాంచీలకు సంబంధాలు తెగిపోయాయి. కోట్లల్లో నష్టం వాటిల్లుతుందని అంతా ఆందోళన చెందుతున్నారు.
ఇక పత్రికల కార్యాలయాలు, టీవీ న్యూస్ ఛానెళ్ళ కార్యాలయాలూ గగ్గోలు పెడుతున్నాయి. ఆరోజు ప్రచురించాల్సిన పత్రిక ప్రచురించ లేకపోయారు, రావలసిన న్యూస్ అప్‌డేట్స్ రాకపోవడమే ఆ గగ్గోలుకు ప్రధాన కారణం! వీటన్నిటికీ ప్రధాన కారణం ఇంటర్నెట్ పనే్చయకపోవడమే! వ్యాపార, వాణిజ్య సంస్థల పరిస్థితి ఇక చెప్పాలా?
అమెరికాలో కాదు, ఆస్ట్రేలియాలో కాదు. ఆఖరికి మన దేశంలో కూడా కాదు. ప్రపంచం యావత్తూ ఇవే సమస్యలు. ఇంకా జఠిలమైన సమస్యలూ కేవలం ఇంటర్నెట్ మూతబడ్డమే ప్రధాన కారణంగా ఉత్పన్నం అవుతారుూ అంటే ఆశ్చర్యం కాదు!
ఇలా జరుగుతుందా? అంటే జరుగుతుంది అని చెప్పలేకపోయినా, సాధ్యమేనని చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికే హేకింగ్ ధర్మమానని రోజూ ఎన్నో వెబ్‌సైట్లు పనిచేయకుండా పోతున్నాయి. వికీలీక్స్ లాటివి ప్రపంచ ప్రభుత్వాలను ఇరుకులో పడేసే రీతిలో ప్రవర్తిస్తున్నాయి. రోజుకో కుంభకోణం వెలుగుచూస్తోంది. ఇటీవలే ఈజిప్టు లాటి దేశాల్లో ఇవిప్లవానికి నాంది పలికిన ఇంటర్నెట్ భవిష్యత్‌లో ఎన్ని విప్లవాలకు దారి తీస్తుందోనని ఇప్పటికే భయపడుతున్నారంతా.
ఇప్పటికే చైనా లాటి దేశాలు కొన్ని వెబ్‌సైట్లను వారి దేశాల్లో బ్యాన్ చేసింది కూడా. ఇలాటి పరిస్థితులే కాకుండా, ఒక్కోసారి ఇంటర్నెట్ అనుసంధానం కోసం వాడే ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ప్రపంచవ్యాప్తంగా వేస్తున్నారు. వీటిలో ఏ కేబుల్‌లో ఎక్కడ ‘కట్’అయిపోయినా ఇంతే సంగతులు. ఇంటర్నెట్ రాకపోయే ఛాన్సులెక్కువ. ఈ ఆప్టికల్ కేబుల్స్ సముద్ర గర్భంలోనుంచి వేస్తున్నారు.
ఇలా ఇప్పటికే రెండుసార్లు జరిగింది!
అది ఫిబ్రవరి, 2008 సంవత్సరం! మధ్యధరా సముద్రంలో వున్న ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోయాయి! మధ్యప్రాచ్యంలోని పలు దేశాలల్లో ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తూండిన నెట్‌వర్క్‌లన్నీ ఒక్కసారిగా మూతబడ్డాయి (ఇండియాతో సహా!). ఇంటర్నెట్ మీద ఆధారపడి పనిచేసే పలు రంగాలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది.
సముద్ర గర్భంలోని కేబుల్స్ భారీ చేపల వలల వల్లా, నౌకల లంగర్లవల్లా, సముద్రంలో వచ్చే ఉపద్రవాలవల్ల అప్పుడప్పుడూ తెగిపోతూంటాయి. ఐతే బ్యాకప్‌గా అదనపు లైన్లుండటంవల్ల ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడదు. 2008లో ఫిబ్రవరి నెలలో ప్రధాన కేబుల్ కాదు, బ్యాకప్ కేబుల్స్ కూడా తెగిపోయాయి. దాంతో అనేక దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇలా జరగడం చరిత్రలో మొదటిసారేమీ కాదు. 2006లో డిసెంబర్ నెలలో కూడా ఒకసారి ఇలా జరిగింది. అయితే తైవాన్‌కు చెందిన సర్వీస్ ప్రొవైడర్ 8లో 7 కేబుల్స్, సముద్ర భూకంపంవల్ల తెగిపోయాయి. ఫలితంగా హాంగ్‌కాంగ్‌తో సహా ఆసియాలోని పలు ప్రాంతాల్లో కొన్ని నెలలపాటు ఆ సంస్థ అందించే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
ఐతే అప్పటి పరిస్థితి వేరు. ఇప్పటి పరిస్థితి వేరు! ఈ ఐదేళ్ళలో ఇంటర్నెట్ కేవలం పీసీల ఆధారంగానే కాదు. మొబైల్ ఫోన్‌ల ఆధారంగా కూడా అందుబాటులోకి రావడం, ఫలితంగా ఆడియో, విడియో సేవలు, మొబైల్ బ్యాంకింగ్ సేవలు వగైరాలు చాలా ఎక్కువగా వినియోగిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యూసర్లు.
మూసేస్తేపోలా?
సైనిక చర్యలు, అణుబాంబులు, యాసిడ్ రైన్‌లు కురిపించడం, భూభాగాన్ని ఆక్రమించడం అనేవి ఒక దేశం మరో దేశంపై చూపే అరాచకాల్లో కొన్ని. ఐతే ఈ సైబర్ యుగంలో వాటిని మించింది వెబ్‌సైట్లపై దాడి చేయడం. వాటికన్నా ఇది చాలా ప్రమాదకరం. వెబ్‌సైట్లపై దాడి చేయడం, ఇంటర్నెట్ కేబుల్స్‌ను నష్టపరచడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పనిచేయనీకుండా చేసేయడం అంత కష్టమేమీ కాదు. ఇది కొండొకచో సైబర్ యుద్ధానికి దారి తీయవచ్చు. అలాటి పరిస్థితుల్లో

అమెరికా అధ్యక్షుడైనా మరొకరైనా ‘‘ఎందుకొచ్చిందీ న్యూసెన్సు! ఇంటర్నెట్ మూసేస్తే పోలా?’’ అనుకొంటే కూడా ఇంటర్నెట్ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఏ చైనా దేశమో, మరోటో అమెరికా దేశపు ఫార్చ్యూన్ కంపెనీల వెబ్ పోర్టల్స్ మీద చేస్తే మాత్రం అలా జరిగే అవకాశాలున్నాయంటున్నారు విశే్లషకులు.
మరి ఇలాటి పరిస్థితుల్లో ఏదో ఒకటి కారణమైతే, ఇంటర్నెట్ పనే్జయడం మానేస్తే పరిస్థితేంటి? ఎందుకంటే, ఇంటర్ ‘నెట్ ఆడితే గానీ డొక్కాడద’నే పరిస్థితి నేడు దాదాపు జనాలందరికీ దాపురించింది. ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం - ఇవన్నీ పాత కాలంలో జరిగేవి. ఈ కాలంలో కావాలంటే ఒక హేట్ వెబ్‌సైట్ నెలకొల్పి, తమకు కిట్టనివాళ్ళను తిట్టిపోసేయడం కూడా జరుగుతోంది. ఇంటర్నెట్ వనరులకు కొదవ లేదు. బ్యాంకు లావాదేవీలు, కార్యకలాపాలూ- అన్నీ నెట్ ఆధారితంగానే జరుగుతున్నాయి. అందువల్ల ‘సైబర్ అటాక్’ శత్రువులకు లాభదాయకమైన అస్త్రం! అంటున్నారు విశే్లషకులు.
మాయాబజార్ సిన్మాలో చినమయ్య శిష్యుడు ‘పెళ్ళి చేయడం చేతకాదు కానీ, చెడగొట్టడం అంటేనా? ఓహో!’ అని అంటాడు. ‘పెళ్లి చెడగొట్టాలి’ అని ఘటోత్కచుడు అన్నపుడు. సరిగ్గా హేకర్ల మనో స్థితీ అదే! హేకింగ్ అనేది ఆరోగ్య పరిస్థితుల్లో బాగానే విజ్ఞానదాయకం కానీ, హేకింగ్‌ని విధ్వంసాలకు వాడుతున్నారు ఎక్కువగా! ఇటీవలే. వెలువడిన ఒక నివేదిక ప్రకారం సహజంగా ఏర్పడే ప్రకృతి వైపరీత్యాలకు దీటుగా సైబర్ అటాక్‌లు పెనుతుఫానులా ముంచుకొచ్చే ప్రమాదాలు లేకపోలేదు. ఇవి ఏక కాలంలో వెబ్‌సైట్లనీ, ఇంటర్నెట్ బ్యాక్‌బోన్‌నీ విధ్వంసం చేసేయగలవు. ఐతే మొత్తం వ్యవస్థకు ముప్పువాటిల్లగల్గినా, వ్యవస్థ కూలిపోదు. ఆయా ప్రభుత్వాలు తమ దేశాల్లో ఇంటర్నెట్‌ను నిషేధించవచ్చేమో గానీ మొత్తం ప్రపంచంలో ఇంటర్నెట్‌ను మూసేయడం ఎవరితరమూ గాదు, ఇటీవల ఈజిప్టులో జరిగిన తిరుగుబాటులో భయభీతుడైన ముబారక్ ఇంటర్నెట్‌ను ప్రజలకు అందనీయకుండా చేశాడొక స్థితిలో. దానికి ఎలాటి చట్టమూ చేయలేదు. కానీ దేశంలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఇంటర్నెట్ సేవలను నిలిపేయమని మాత్రమే ఆదేశించాడు. బిల్‌గేట్స్ ఒకానొక సందర్భంలో అన్నట్టు, ‘‘ఇంటర్నెట్‌ను మూసేయడం పెద్ద కష్టమేమీ కాదు. మిలిటరీ సైన్యాన్ని దించేసి ప్రజలకు నచ్చచెప్పి, హెచ్చరించి మూసేయవచ్చు.’’ ఐతే, ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమా? సైబర్ టెర్రరిజమ్ వల్లే ప్రజాస్వామ్యానికి ముప్పుగానీ సైనిక చర్యలు చేపట్టలేదు కదా? అని మరో విశేషజ్ఞుడామధ్య వ్యాఖ్యానించాడు. గత ఏడాది అమెరికాలో దేశీయ అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ను మూసేయడానికి అమెరకా అధ్యక్షునికి పూర్తి అధికారాలను ఆపాదించేలా ఒక బిల్లును రూపొందించారు. 197 పేజీల ఈ రిపోర్టు సైబర్ స్పేస్‌ను జాతీయ సంపదగా పేర్కొంటూ, దానిని కాపాడటానికి అమెరికా అధ్యక్షునికి అన్ని రకాల అధికారాలనూ ఆపాదించింది. అంటే, ఐతేగియితే ప్రపంచంలో ఇంటర్నెట్‌ను మూసేసే ‘కిల్లర్ స్విచ్చి’ అమెరికా అధ్యక్షుని చేతిలో ఉంటుంది. మాంత్రికుడి చేతిలో మంత్ర దండంలా ఇది అమెరికా అధ్యక్షునికి వినియోగపడుతుందన్నమాట. వీటన్నిటికీ ‘వికీలీక్స్’ లాటి సంఘటనలే నేపథ్యం. ట్విటర్ ద్వారా వికీలీక్స్‌లోకి లాగిన్ కాగల్గడమే ప్రధాన కారణం. ఐతే అమెరికాలోని ఎఫ్‌బిఐ సంస్థ, ‘ఇంటర్నెట్ మూసేయడం ప్రత్యామ్నాయం కాదనీ, నిర్దిష్టమైన ప్రామాణిక సూత్రాలూ, మార్గదర్శకాలూ రూపొందించి, తదనుగుణంగా వివిధ వాణిజ్య, వ్యాపారసంస్థలు వాటిని వారి వెబ్‌సైట్లను రూపొందించేలా చూస్తే సరిపోతుందనీ’ ప్రకటించింది.
ఒకప్పుడు ఇంటర్నెట్ అనేది కేవలం రక్షణశాఖ అవసరాలకోసం రూపొందించాలని భావించినా అమెరికా, దానిని ప్రజలందరికీ చేరువచేసింది. ఇపుడు ‘వికీలీక్స్’ లాటి సంఘటనలవల్ల, సైబర్ యుద్ధాలకు దారితీస్తున్న పరిస్థితులవల్లా ఇంటర్నెట్‌వాడకంపై ఆంక్షలు విధించడమో లేక మూసేయడమో బెస్టు అని అమెరికా భావిస్తున్నట్టుంది. ఇది దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందని నిర్ధారణకు వచ్చేస్తే, ఇక అంతర్జాలం మాయమైపోతుంది.
ఇంట్లోనే అన్నిటినీ నెట్టుతూ ఉన్న ఇంటర్నెట్, కుర్చీలోంచి కదలకుండా టికెట్లు రిజర్వ్ చేసుకొనే వీలునీ, బ్యాంకింగ్ కార్యకలాపాలనీ చేసుకోవడం అలవాటు చేసిన ఇంటర్నెట్, పని వున్నా లేకున్నా ఇమెయిల్స్, చాటింగ్ లోకి యువతను ముంచేసిన ఇంటర్నెట్, ఒకవేళ ఆగిపోతే ఏవౌతుందనే భయాందోళనలతో మనం సతమతం కావలసిన అవసరమేమిటీ? అంటే, ఏమీ లేదు. తిరిగీ మరో రెండు దశాబ్దాలు వెనక్కిపోయి అలనాడు ఏంచేస్తూండినామో అదే చేస్తాం!
మళ్ళీ అదే రకంగా అంగళ్ళముందు, ఆఫీసులముందు ‘క్యూ’లు కడతాం! సమాచారంకోసం రోజులకొద్దీ నిరీక్షిస్తాం! ఇప్పటిలాగా రేపు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసి పట్టుకొని రండి అని టీచర్లు అనడానికి ఉండదు. ఇగవర్నెన్స్ అంటూ బడ్జెట్ కేటాయింపులు అవసరం ఉండదు. దానిలో తిరిగి అవినీతి జరిగే అవకాశం ఉండదు. అయ్యో! ఇంటర్నెట్‌లో చెడు సైట్లు చూసి మా పిల్లలు పాడైపోతున్నారని బాదపడాల్సి ఉండదు. అంతా క్షేమంగానే ఉంటాం! ఎటొచ్చీ స్టాక్ ఎక్స్‌ఛేంజీలూ, బ్యాంకులూ ఇలా ఇంటర్నెట్ ఆధారిత సేవలను మానేయవచ్చు కానీ వారి నెట్‌వర్క్ ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకొంటారు. పనులన్నీ మామూలుగానే జరిగిపోతాయి! అంతే! మళ్ళీ పాతరోజులొస్తాయి. ‘తపాలా’కు. *
ఇంటర్నెట్‌లో విభిన్న సౌకర్యాలు!

* ఇమెయిల్, చాటింగ్, మెసేజింగ్, విడియో కాన్ఫరెన్స్, బ్రౌజింగ్, ఆన్‌లైన్ సేవలు.
* భ్రాంతి కార్యాలయం (వర్చువల్ ఆఫీస్)- ఈ సౌకర్యంవల్ల ప్రతి ఊరిలోనూ కార్యాలయం ఏర్పాటుచేసుకోవాలనుకొనే సంస్థలకు చాలా వెసులుబాటు కలిగింది. నెట్ ద్వారా కేవలం క్షణాల్లో ఆఫీసు బ్రాంచి కార్యాలయాలను ఏర్పాటుచేసుకోవచ్చు.
* పీసీల్లేకుండా ఇంటర్నెట్ సౌకర్యం.
* డిస్క్ స్టోరేజీ అక్కర్లేకుండా పీసీల వినియోగం.
* అంతా ఆన్‌లైన్‌గా పొందే సౌకర్యం- అది ఫోటోషాప్ సాఫ్ట్‌వేర్ కావచ్చు. ఎమ్మెస్ ఆఫీసు కావచ్చు. ఇలా ఎన్నో..

ఇంటర్నెట్ పితామహుడు- జాన్ పోస్టెల్
జొనాథన్ పోస్టెల్ లేదా జాన్ పోస్టెల్ (1943-1998)ని ఇంటర్నెట్ పితామహునిగా చెబుతారు. ఇంటర్నెట్ సిద్ధాంతం కార్యరూపం దాల్చి పనిచేసే స్థాయికి ఎదిగిందీ అంటే దాని వెనక పోస్టెల్ బృందం కృషి ఎంతో ఉంది. ఎంతో సీదాసాదాగా వుండి పోస్టెల్ కృషివల్లే, ఇంటర్నెట్, వెబ్‌సెర్చి, ఇమెయిల్ సౌకర్యాలు ఆవిర్భవించాయి. ఇంటర్నెట్ సొసైటీ వ్యవస్థాపకులలో ఒకనిగా ఉంటూ దానికి 1996-98 ప్రాంతాల్లో ట్రస్టీగా కూడా పనిచేశారు. ది ఎకనమిస్ట్ పత్రిక ఆయన్ను ‘ఇంటర్నెట్ గాడ్’గా అభివర్ణించింది.

ఇంటర్నెట్ ఆవిర్భావ క్రమం!
1957: సోవియట్ యూనియన్ ‘స్పుత్నిక్’ అనే కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే, అమెరికా ‘అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీని ఆరంభించింది.
1962: కంప్యూటర్లను అనుసంధించి నెట్‌వర్క్‌గా ఏర్పాటుచేయాలనే ఆలోచన మసాచుసెట్స్‌కు చెందిన జె.సి.ఆర్.లిక్‌డైర్‌కి వచ్చింది.
పాల్ బారన్ (రేండ్ సంస్థ) ‘పాకెట్ స్పిచింగ్’ పరిజ్ఞానాన్ని రూపొందించాడు. దీంతో రెండు కంప్యూటర్ల మధ్య డేటాను చిన్న పాకెట్‌లుగా పంపే / అందే సౌకర్యం ఏర్పడింది.
1965: తొలిసారిగా టెలిఫోన్ లైన్ ద్వారా పంపే సౌకర్యం వచ్చింది.
1968: ఆర్పనెట్ అనే నెట్ వర్క్ రూపకల్పన జరిగింది. దీంతో లాస్‌ఏంజెల్స్, శాంతా బార్బరాల్లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, స్టాన్‌ఫోర్డ్ రిసెర్చ్‌సంస్థ, యూనివర్సిటీ ఆఫ్ ఉథా- అనే నాలుగు సంస్థలను అనుసంధానం చేశారు.
1969: నెట్‌వర్క్ కంట్రోల్ ప్రోటోకాల్ (ఎన్‌సిపి) రూపకల్పన జరిగింది.
1972: ఇమెయిల్ సౌకర్యం ఆవిర్భవించింది. రేటోమ్లిన్‌సన్, తొలి ఇమెయిల్‌ని రూపొందించాడు.
1973: పాకెట్ స్విచింగ్ పరిజ్ఞానం బ్రిటన్, నార్వే దేశాలకు విస్తరించింది. టిసిపి/ ఐపి అనే పరిజ్ఞానం రూపొందింది.
1974: వింట్ సర్ఫ్, బాబ్‌కాన్ అనే ఇద్దరు ‘ఇంటర్నెట్’ అనే పదాన్ని తొలిసారిగా వాడారు.
1976: ఈథర్‌నెట్ ఆవిర్భావం. SATNET ఆరంభమైంది. అమెరికా, యూరప్‌లను కలిపిందీ నెట్‌వర్క్.
1979: యూస్‌నెట్, బిట్‌నెట్ సేవలు ఆరంభమైనాయి.
1982: ఎన్‌సిపి స్థానంలో టిసిపి/ ఐపి వాడుకలో కొచ్చింది. ఇంటర్నెట్-2 రూపకల్పన.

డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ రూపశిల్పి- బెర్నర్స్ లీ
మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎం.ఐ.టి)లో ప్రొఫెసర్‌గా పనిచేసిన తిమోతి జాన్ బెర్నర్స్‌లీ ఆంగ్ల దేశ శాస్తవ్రేత్త. 1989లో తన వరల్డ్ వైడ్ వెబ్ తొలి ప్రతిపాదనను చేశాడు. 1990 నాటికి దానికో రూపుతెచ్చి విజయవంతంగా అమలుచేశాడు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, హెచ్‌టిటిపి ప్రోటోకాల్స్‌ను రూపుదిద్ది అమలులోకి తెచ్చాడు. ఎనె్నన్నో అవార్డులు సొంతం చేసుకొన్నాడు. 20 ఏళ్ళు పూర్తయినా వెబ్ ఇంకా బాల్యావస్థలోనే ఉందని ఆయన ఆమధ్య కామెంట్ చేయడం గమనార్హం!

ఇంటర్నెట్ పొందేందుకు మార్గాలు?
మోడెం, డిఎస్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్, వైఫీ, వైమాక్స్,
వీటిల్లో ఇంటర్నెట్‌ను పల్లెపల్లెకూ తీసుకెళ్ళేందుకు అత్యంత చౌకయైన ప్రత్యామ్నాయం వైమాక్స్. ఒక టవర్‌ను నెలకొల్పితే 50 కి.మీ. పరిధిలో ఇంటర్నెట్ సౌకర్యం రెడీ. డిఎస్2 బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లకు అనుబంధంగా పనిచేస్తుందిది. వరల్డ్ వైడ్ ఇంటర్ ఆపరబిలిటీ ఫర్ మైక్రోవేవ్ అనడానికి క్లుప్తంగా ‘వైమాక్స్’ అంటారు. వైఫీ పరిధి 30 కి.మీ. ఐతే వైమాక్స్‌ది 50 కి.మీ. కావడం గమనార్హం!
శ్రశ్రశ్రమోడెం, డిఎస్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్, వైఫీ, వైమాక్స్,
వీటిల్లో ఇంటర్నెట్‌ను పల్లెపల్లెకూ తీసుకెళ్ళేందుకు అత్యంత చౌకయైన ప్రత్యామ్నాయం వైమాక్స్. ఒక టవర్‌ను నెలకొల్పితే 50 కి.మీ. పరిధిలో ఇంటర్నెట్ సౌకర్యం రెడీ. డిఎస్2 బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లకు అనుబంధంగా పనిచేస్తుందిది. వరల్డ్ వైడ్ ఇంటర్ ఆపరబిలిటీ ఫర్ మైక్రోవేవ్ అనడానికి క్లుప్తంగా ‘వైమాక్స్’ అంటారు. వైఫీ పరిధి 30 కి.మీ. ఐతే వైమాక్స్‌ది 50 కి.మీ. కావడం గమనార్హం!
No comments:
Post a Comment