Thursday, August 25, 2011

IT రక్షక భటులు!



-డా. సాయి అయితిక పేరుతో ఆంధ్రభూమి లో వచ్చిన వ్యాసం.....

June 28th, 2011


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒకప్పుడు ఫ్యాషన్. ఇప్పుడు ఫ్యాషన్‌తో కూడిన ప్రొఫెషన్. ఆ రంగంలో ఉద్యోగాల గురించి యూత్‌లో ఉండే క్రేజ్ ఇంత అని చెప్పలేం. ఇంతకాలం, ఐటి అంటే సమాచారాన్ని అందించటం. ఇప్పుడు -ఆ సమాచారానే్న సురక్షితంగా అందించాలి. సురక్షితంఅన్న దానికోసం ఇన్నాళ్లూ ఎలాంటి ప్రత్యేక కోర్సూ, శ్రద్ధా ఉన్న దాఖలాల్లేవు. ఇటీవలే -ఐటి సెక్యూరిటీ అనేది ప్రత్యేక విభాగమైంది. అదొక భిన్నమైన రంగంగా రూపొందుతుంది. అందుకే -ఐటి సెక్యూరిటీ ప్రొఫెషనల్ అనేది తాజా బజ్‌వర్డ్.
**
ఇంటర్నెట్ వినియోగం విస్తృతమైనట్టే -రెట్టింపు ఇబ్బందులూ పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లు సైబర్‌దాడుల బారిన పడుతున్నారు. అలాంటి దాడులను తిప్పికొట్టే ప్రొఫెషనే -ఐటి సెక్యూరిటీ.
సైబర్ ప్రపంచం పరిస్థితి? ఇంటర్నెట్ మాధ్యమంగా జరిగే సైబర్‌దాడులు? వాటికి విరుగుడు..? సైబర్ దాడుల్ని తిప్పికొట్టడం ఎలా? -ఇలాంటి విషయాలపై ఆసక్తి ఉండేవాడే -ఆన్‌లైన్ సెక్యూరిటీ అనలిస్టు అవుతాడు. హ్యాంకింగ్, ఎథికల్ హ్యాకింగ్ -వీటి గురించి అవగాహన కలిగి, టెక్నాలజీ ఇచ్చే సుఖాల మాటున దాగిన నష్టాలు, ఆపదలను నివారించే గుడ్ సమారిటన్’ -ఐటి సెక్యూరిటీ అనలిస్టు.
ఆన్‌లైన్ ఆధారంగా జనాలు అందించే వ్యక్తిగత సమాచారం, వారి బ్యాంకు అకౌంట్ వివరాలు, క్రెడిట్‌కార్డు వివరాలను రహస్యంగా అందిపుచ్చుకుని దుర్వినియోగం చేయడం హ్యాకర్ల పని. ఎదుటివాడు ఏడుస్తుంటే, వీళ్లకు సంతోషం. అయితే ఇక్కడ -ఆన్‌లైన్ సెక్యూరిటీ అనలిస్టులు చేసేదీ హ్యాకింగే. కాకపోతే ఎథికల్ హ్యాకింగ్. ఒక హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ వ్యవస్థను తుత్తునియలు చేసేందుకు ప్రయత్నించే ఎలాంటి లొసుగులైనా బయటపడితే, వాటిని గుర్తించి లోపాలను సవరించడానికి అనలిస్టులు ఇతోధికంగా తోడ్పడతారు.
నెట్‌వర్కులో ఉండే లొసుగులని గుర్తించి -ఫైర్‌వాల్స్ నిర్మించే దిశగా పనిచేస్తారు. సంస్థాగతంలో లాన్, యాంటీవైరస్‌లు సక్రమంగా పనిచేసేలా చూస్తూ, ఎలాంటి అప్‌డేషన్స్ జరిగినా సరైన రీతిలో డాక్యుమెంటేషన్ చేసి ఉంచే పని వీళ్లది. ఇటీవలి కాలంలో ఈ-మెయిల్ మోసాలూ పెరిగాయి. ఎస్సెమ్మెస్‌ల వరదలో మోసాలు ప్రబలిపోయాయి. ఇవన్నీ సైబర్ ప్రపంచపు నేరాలే. వీటిని అరికట్టాల్సిన బాధ్యత అటు సంస్థలపైనా ఉండటంతో, ఆయా సంస్థల్లో సెక్యూరిటీ అనలిస్టుల అవసరాలు పెరుగుతున్నాయి.
**
ఇంతకుముందూ ఐటి రంగంలో సెక్యూరిటీ అనలిస్టులు ఉన్నారు. కానీ, వారి పనులు పరిమితం. ఇంటర్నెట్ శకంలో పరిస్థితులు మారిపోయాయి.
అటు వెబ్ సర్వర్లు, ఇటు యూజర్లు వాడే పర్సనల్ కంప్యూటర్లూ, లాప్‌టాప్‌లూ, స్మార్ట్ఫోన్లూ -అన్నీ వైరస్ అటాక్‌లకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేదెంతో కీలకమైన అంశంగా మారటంతో, ఐటి సెక్యూరిటీ అనేది ప్రత్యేకమైన ఉద్యోగంగా, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐటి సెక్యూరిటీ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టిమ్స్, ఇన్ఫర్మేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, కంప్యూటర్స్ అండ్ నెట్‌వర్క్ -వీటన్నిటిలోనూ కీలకం. ఇలాంటి నిపుణుల కొరత భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. నాస్‌కామ్ అంచనాలే నిజమైతే అతి సమీప భవిష్యత్‌లో రెండు లక్షల మందికి ఈ రంగంలో ఉద్యోగాలు దొరకటం ఖాయం.
**
ప్రస్తుతం హైటెక్, సైబర్ సిటీలుగా వెలుగొందుతున్న బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీల్లో సెక్యూరిటీ అనలిస్టు ఉద్యోగాల ఓపెనింగ్స్ బావున్నాయి. నిజానికి ఇండియాలో సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ జాబ్స్, మెయిన్‌ఫ్రేమ్ జాబ్స్, ఐటి స్పెషలిస్టు జాబ్స్ -వీటికి డిమాండ్ ఎప్పుడూ ఉంది. నాస్‌కామ్ సంస్థ అంచనాలు ఎంతవరకూ నిజమవుతాయో తెలీదు కానీ, డిమాండ్ మాత్రం ఉంది. నెట్‌వర్క్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్స్, అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టర్, ఫోరెన్సిక్ టెస్టర్, ఎథికల్ హ్యాకింగ్, జూనియర్ సెక్యూరిటీ ఆడిటర్, సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొగ్రామర్, సెక్యూరిటీ సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ యూజర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కన్సల్టెంట్, సెక్యూరిటీ ఆడిటర్ -ఇలా ఉద్యోగాలు చాలా ఉన్నాయి. పలు సంస్థల్లో వీరి అవసరం గుర్తించి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక విభాగానే్న ఏర్పాటు చేస్తున్నారు కూడా. బిటెక్ (కంప్యూటర్ సైన్స్) చేసి సెక్యూరిటీ సర్టిఫైడ్ కోర్సులను చేసిన వారికి కనీసంగా 15వేలు, గరిష్టంగా 30వేలు నెల జీతంతో ఈ ఉద్యోగాలు ఊరిస్తున్నాయి.
***
ఆన్‌లైన్ సెక్యూరిటీ అనలిస్టుగా రాణించాలంటే, ఆ రంగంలో ఆసక్తిమాత్రమే కాదు, కొత్త డెవలప్‌మెంట్స్ ఏం జరుగుతున్నాయో తెల్సుకునే ఆసక్తీ అవసరం. క్రిమినల్గా ఆలోచించి పోలీస్లా పరిష్కారాలను రూపొందించాలి. సైబర్ దొంగకన్నా ముందే అనలిస్టు ఆలోచించి, ఎలాంటి సైబర్ అటాక్ రాబోతుందో పసిగట్టి, పరిష్కారాలనూ చేతబట్టి ఉంటే, ఇక అనలిస్టులకు తిరుగే ఉండదు.

సెక్యూరిటీ అనలిస్టు
కావాలనుకుంటే
ఈ సెక్యూరిటీ అనలిస్టు/ స్పెషలిస్టు సర్ట్ఫికేషన్ కోర్సులు ఆన్‌లైన్‌లో ఈ-లెర్నింగ్ కోర్సులుగానూ లభిస్తున్నాయి. డ్ళ, ళడ్ళ, హఉ వంటి సంస్థలు ఇలాంటి కోఠ్సులు అందిస్తున్నాయి. అంకిత్ ఫాడియాపేరు యూత్‌లో అందునా ఐటీరంగంలో విననివారుండరు. ఈ అంకిత్ ఫాడియా పేరుతో కూడా ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ కూడా పలురకాల కోర్సులనీ, సర్ట్ఫికేషన్స్‌నీ అందిస్తోంది.
ఆసియన్ స్కూల్ ఆఫ్ సైబర్ లాఅనే సంస్థ కూడా ఇలాంటి కోర్సులని నిర్వహిస్తోంది. అంకిత్ ఫాడియా నిర్వహించే నెల వ్యవధి కోర్సులను ఇండియాలో దాదాపు 100 నగరాల్లో లభిస్తున్నాయి. ఘజియాబాద్‌లో ఐఎంటి సంస్థ ఏడాది పిజి డిప్లమా, రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ కూడా ఈ రకం అనలిస్టు ఉద్యోగాలకు ఆసరానిస్తాయి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ లో బిటెక్, ఎమ్మెస్సీలు చేసిన వారు ఈ రంగాన్ని ఎంచుకుంటే భవిష్యత్ ఎంతో ఉజ్వలంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఈ-కామర్స్ అనే సంస్థ కూడా పలురకాల సర్ట్ఫికేషన్స్ ఇస్తోంది. సిస్కో సర్ట్ఫికేషన్స్‌లాంటివెన్నో ఉన్నాయి.

No comments:

Post a Comment