-కె.స్వాతి
Andhrabhoomi dailyApril 16th, 2011
150 వసంతాల
వావిళ్ల వాఙ్మయ వైజయంతి
వావిళ్ల రామశాస్ర్తీ అండ్ సన్స్
10, హస్తినాపురం దక్షిణం
నాగార్జునసాగర్‌రోడ్,
వైశాలినగర్ పోస్ట్,
హైదరాబాద్-500 079
040-24093427
ఇంతకూ ఏమిటీ పుస్తకం? ఎందుకీ పుస్తకం? అని ప్రశ్నలు రావడం సహజమే. పుస్�-font-family: Arial;">వావిళ్ల వారన్నది ఒకరికి ఇంటి పేరు కావచ్చు. కానీ తెలుగునాట మాత్రం అది మంచి పుస్తకాలకు గల ఇంటిపేరు. ‘చేతివ్రాత పుస్తకములు చదువుకునే దినాలలో శ్రీ వావిళ్ల రామస్వామి శాస్త్రులవారు ముద్రణాలయమును స్థాపించి చదువరుల కష్టములను నివర్తి చేసిరి’-అని సి.పి.బ్రౌను అన్నారట. ఆయనెవరు? అని అడిగే వాళ్లకు నాదగ్గర జవాబు లేదు.
‘ఇది నా దేశం, నా భాష, నా సంస్కృతి-సాహిత్యం, స్వాతంత్య్రం అనే భావనలు దాదాపు 20వ శతాబ్దం ఆరంభంలో మన మస్తిష్కాలలో ప్రవేశించినా, వాటిని ప్రచారం చేసి ప్రభావవంతం చేసింది ప్రచురణ రంగమని ఘంటాపథంగా చెప్పవచ్చును’ అంటారు ఈ పుస్తకాన్ని సిద్ధం చేసిన సంపాదక మండలివారు తమ ‘సేవా ప్రస్తుతి’లో!
ఇంతకూ ఏమిటీ పుస్తకం? ఎందుకీ పుస్తకం? అని ప్రశ్నలు రావడం సహజమే. పుస్తకాలంటే తెలియని కాలంలో, వావిళ్ల రామస్వామి శాస్త్రులుగారు ఒక ప్రచురణ సంస్థపెట్టి వందల సంఖ్యలో ‘మంచి’ పుస్తకాలు వేశారు. ఆయన కుమారులు వేంకటేశ్వర శాస్త్రులు గారు ఆ కార్యక్రమాన్ని మరింత బలంగా, మరింత ముందుకు నడిపారు. ప్రాచీన తెలుగు సాహిత్యం మీద ఏ కొద్ది ఆసక్తిగల వారికయినా వావిళ్ల ప్రచురణలు పరిచితులయి ఉంటాయి. వారు రామాయణ, భాగవతాలే కాక విమర్శలు వ్యాసాలు మొదలు కథల వరకు అచ్చువేశారు. తెలుగుతోపాటు, సంస్కృతం, తమిళం, ఇంగ్లీషు పుస్తకాలు కూడా అచ్చువేశారు. ఈ సంస్థ మొదలైంది 1854 సంవత్సరంలో! అంటే నేటికి నూటయాభయి సంవత్సరాలుకన్నా ముందే! అందుకే ఆ సంస్థవారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎందరెందరో పెద్దల చేత, ఎనె్నన్నో అంశాల గురించి వ్యాసాలు రాయించి ‘వైజయంతి’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఒక్కచోట ఇన్ని సాహిత్య వ్యాసాలున్న పుస్తకం, యువభారతి వారి మహతి తర్వాత మళ్లీ ఇదే! అయితే, వైజయంతిలోని వ్యాసాలన్నీ, చాలా పాతకాలపు అంశాల గురించి మాత్రమే ఉన్నాయి.
పుస్తకాలు ఎందుకు? అని అడుగుతున్న ఈ కాలంలో, ఇంత పెద్ద వ్యాస సంకలనం, అదీ క్లాసికల్ అంశాల గురించి మాత్రమే అచ్చువేయడం, వావిళ్ల వారి పద్ధతికి ఉదాహరణేమో! ఈ సంకలనంలో వందకుపైగా వ్యాసాలున్నాయి. దీన్ని సూవెనీర్ అని అనలేదు గానీ, అదే పద్ధతిలో ముందు కొన్ని చిత్రాలున్నాయి. సంస్థకు ప్రాణం లాంటి తండ్రీ, కొడుకుల బొమ్మలను బాపుగారి చేత వేయించి, అచ్చువేయడం బాగుంది. తరువాత ఎన్నో అభినందన సందేశాలు. వావిళ్ల సంస్థను, అందులో పాల్గొన్న వ్యక్తులను గుర్తుచేస్తూ వ్యాసాలు, అభినందన పద్యాలు, ఇవన్నీ మొదట్లో ఉన్నాయనుకోండి. ఆ తరువాత మీకుగాని గతం మీద గౌరవం, గతం గురించి తెలుసుకోవాలన్న కోరికా ఉంటే, ఆపకుండా చదివించే పద్ధతిలో ఒకదాని వెనక ఒకటిగా వ్యాసాలున్నాయి.
పుస్తకం లెక్క ప్రకారం 2005 ప్రాంతం, ఆ వెంటనే రావలసింది. కానీ ఆలస్యం అయిందని సంపాదకులే క్షమాపణలు చెప్పుకున్నారు. ఇంతమంది రచయితలచేత వ్యాసాలు రాయించి, వాటిని ‘వావిళ్ల’ పద్ధతిలో కంపోజ్ చేయించి, అచ్చువేయడం సులభం మాత్రం కాదు. అందుకే ఆలస్యం అయి ఉంటుంది. తప్పులు చూపించిన వారికి, ఆ కాలంలోనే డబ్బులు ఇవ్వడం వావిళ్ల వారి ప్రత్యేకత!
పుస్తకం చివరలో కొన్ని ఇంగ్లీషు వ్యాసాలున్నాయి. వాటిలోకూడా అంశాలు అన్నీ వావిళ్ల పద్ధతిలోనే! విషయ సూచిక అయిదు పేజీలు దాటింది. పుస్తకంలో పేజీలన్నీ కూడా సులభంగా చదవగలిగే పద్ధతిలో, మరీ చిన్న అక్షరాలు కాకుండా అచ్చువేశారు. ఒక ప్రచురణ సంస్థవారు తమ గురించి, సారస్వతం గురించి వేయించిన పుస్తకం గనుక, ఈ అంశాలన్నింటినీ మనం గమనించి తీరాలి!
ఇక పుస్తకంలోని విషయం గురించి పరిశీలింప బూనుకుంటే ఇందులోని కొన్ని వ్యాసాలు, గతంలో వావిళ్లవారే వేసిన త్రిలింగ రజతోత్సవ సంచికలోనివి. వాటిని నేరుగా ఉంచక, విషయాల ప్రకారం, అక్కడక్కడ పొందుపరిచారు. వావిళ్ల వారిని, ప్రచురణలను గురించిన వ్యాసాల తర్వాత మాతృభాష, వేదము, ఉపనిషత్తుల, ఇతిహాసాల గురించినవి వచ్చాయి. ఆ తరువాత రామాయణము, గీత మొదలైన అంశాలు. భావరాజు వేంకట కృష్ణారావుగారు రాసిన వాత్సాయనుడు-కామ సూత్రములు అన్న వ్యాసం గొప్పది. పైగా వావిళ్ల వారి తీరుకు అది ఒక నిదర్శనం. శ్రీనాధుడు, అన్నమయ్య, నారాయణ తీర్థులు, తెలుగు సాహిత్యంలో రకరకాల అంశాలు ఇలా వ్యాసాల క్రమం సాగుతుంది. భండారు పర్వతాల రావుగారి పుస్తకం ఆత్మకథ లాంటి వ్యాసాలు, క్రమంలో కొంత రిలీఫ్‌గా ఉంటాయి. వజ్జల వి వేంకటరమణ కంప్యూటర్ల గురించి, అల్లాడి ప్రభాకర్‌గారు ఆంగ్లంలో సైన్స్ టెక్నాలజీల ప్రగతి గురించి రాసిన వ్యాసాలు మొత్తం పుస్తకంలో ప్రత్యేకంగా కనిపించి ఆశ్చర్యం కలిగించాయి.
వందకుపైగా రచయితలు! ఎందరి పేర్లని చెప్పగలము? సాహిత్యంలో ఒక పద్ధతికి చెందినవారు అందరూ ఉన్నారనవచ్చునేమో? లేనివారిని లెక్కించడమే వీలుగా ఉండేట్లుంది! వేద వాఙ్మయంలో కథానికలు లాంటి వ్యాసాలు, బహుశాః అందరినీ చదివింపచేస్తాయి. ప్రాచీన తెలుగు సాహిత్యం- తీరు తెన్నులు లాంటి, విస్తృత విషయాల మొదలు శ్రీనాధుని వనితా వర్ణనలు అనే చిన్న విషయాల దాకా ఎన్నో వ్యాసాలు, అన్నీ గొప్పవారి కలాలనుంచి ధారగా వచ్చినవే.
భారతీయ కవిత్వం-తెలుగు వారి సేవ పేరున వెలుదండ నిత్యానందరావుగారి వ్యాసం చాలా డిఫరెంట్‌గా ఉంది!
వైజయంతి చాలా బరువయిన సంకలనం-అన్నిరకాలా! ఆసక్తిగల వారికి అది దాచుకోవలసినదిగా తోచి తీరుతుంది!

ఈ సంకలనంలో నేను వ్రాసిన వ్యాసం కూడా ఉందండోయ్..
ReplyDeleteవి3రమణ