Tuesday, March 27, 2012

నేల విడిచి ఆటలు

25/03/2012                                       -- అనుపమ 



కంప్యూటర్స్, వీడియో కన్‌సోల్స్ లేని కాలంలో ఆ రకమైన గేమ్స్ నవలలకీ, జానపద కథలకీ, సినిమాలకీ మాత్రమే పరిమితమై ఉండేవి. నేడో! గగుర్పాటు కలిగించే రీతిలో కంప్యూటర్ గేమ్స్ ఉన్నాయి. గతంలో పెద్దగా ఆసక్తి కల్గించని ఆటల స్థానంలో నేడు త్రీడీ గేమ్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల వ్యాపారంగా గేమ్స్కొనసాగుతున్నాయి. భారతదేశంలో సైతం ఈ గేమ్స్‌కి క్రేజ్ ఉంది. కంప్యూటర్ గేమ్స్ ఆడేవారిలో పిల్లలకన్నా పెద్దలే అధికం అంటే ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. కంప్యూటర్ గేమ్స్ ఆడేవారి సగటు వయసు 26 సం.లు.దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితమే వీడియో గేమ్స్ వివిధ రూపాల్లో మన మధ్యకు వచ్చాయి. ’80వ దశకంలో ఎక్కడ చూసినా వీడియో గేమ్ పార్లర్లే కనిపించేవి మనకు. సినిమా థియేటర్ల దగ్గర నుంచీ, బార్ల దాకా ఎక్కడ చూసినా ఈ వీడియో గేమ్ బాక్స్‌లే. వాటి ముందు వేలంవెర్రిగా జనాలు నిల్చుని ఆడటం జరిగేది. వాటి తర్వాత హోమ్ వీడియో గేమ్ కన్‌సోల్స్ వచ్చాయి. వీడియో గేమ్ పరికరాన్ని మన టీవీకి కనెక్ట్ చేసి గేమ్స్ ఆడుకోవడం జరిగేది. ఇదే హోం వీడియో గేమ్స్‌కి నాంది అని చెప్పవచ్చు. ఆ తర్వాత హేండ్ హెల్డ్ గేమ్స్ వచ్చాయి. ఇక పర్సనల్ కంప్యూటర్స్ వచ్చాక జనాలంతా ఏకంగా కంప్యూటర్స్‌లోనే గేమ్స్ ఆడటం మొదలెట్టారు. ఇంతలో స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ఇపుడంతా స్మార్ట్ ఫోన్ వేపు మళ్లుతున్నారు. ప్రపంచంలో ఈ కంప్యూటర్ గేమ్స్ ఆడని వారు దాదాపుగా ఉండరనిపిస్తోంది. డబ్బులు చెల్లించి మరీ ఆడటం జరుగుతోంది. అసలు ఫేస్‌బుక్‌కు అంత పాపులారిటీ రావడానికి కారణం ఏమిటో తెలుసా? గేమ్స్! గేమ్స్! ఫేస్‌బుక్ సంస్థ, ప్రముఖ గేమ్స్ డెవలపింగ్ సంస్థ అయిన జింగాతోడ్పాటుతో గేమ్స్‌ను రూపొందింపజేసి ఫేస్‌బుక్ యూసర్లకు అందుబాటులోకి తెచ్చింది. అందుకే ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైటు మిగిలిన వాటికన్నా ముందు ఉండగల్గుతోంది. ఈ జింగా సంస్థ తొలిసారిగా అమెరికాకు బయట, మన దేశంలో బెంగుళూరులో 2010 నుంచి తన కార్యకలాపాలు సాగిస్తోంది. 2011లో ఈ సంస్థ గేమ్స్ రూపొందించడానికి స్టూడియో-1 అనే దాన్ని ఆరంభించింది. ఇంతకన్నా ఆసక్తికరమైన సంగతి మరోటుంది. అమెరికాకు బయట గేమ్స్ తయారీని ఔట్‌సోర్సింగ్ చేశారు. వాటిల్లో సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా దేశాలు ప్రధానమైనవి. ఇప్పుడు తాజాగా ఇండియా కూడా వీటి సరసన చేరింది.ఇండియాలో గేమ్స్ మార్కెట్ 4 రకాలుగా విస్తరించి ఉంటోంది. పీసీ గేమ్స్, ఆన్‌లైన్ గేమ్స్, మొబైల్, కన్‌సోల్ గేమ్స్ అనే ఈ 4 రకాల మార్కెట్స్‌కీ మంచి గిరాకీ ఉంది. 2009లో ఇండియాలో గేమింగ్ మార్కెట్ 5.3 బిలియన్ల రూపాయలు. 2014 నాటికి ఇది 19.4 బిలియన్లు కావచ్చని అంచనా. గ్లోబల్ మార్కెట్‌లో ప్రస్తుతం 40 బిలియన్ డాలర్లు దాటింది. 2013 నాటికి ఇదే 59 బిలియన్ డాలర్లు అవుతుందని అంచనా.ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ మార్కెట్స్‌లో అమెరికా, యూరప్, జపాన్‌లు ప్రధాన స్థానాలను ఆక్రమించి ఉన్నాయి. వీటిలో అమెరికాదే ప్రథమ స్థానం. యానిమేషన్ రంగంలో కూడా అమెరికానే ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఇపుడిపుడే చైనా మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది.ఇండియాలో గేమింగ్ ముఖ్యంగా కన్‌సోల్ గేమింగ్ 2010లో 5.8 బిలియన్ల వ్యాపారాన్ని చేసింది. ఇది 2015 నాటికి 14.2 బిలియన్లు కావచ్చని అంచనా. కన్‌సోల్ గేమింగ్ ముఖ్యంగా టీనేజర్లను ఆకట్టుకుంటోంది. సోనీ, మైక్రోసాఫ్ట్, నిన్‌టెండో సంస్థల కన్‌సోల్స్ బాగా పాపులర్. ఐతే కన్‌సోల్ ధరలు మన దేశంలో ఎక్కువే. 5 నించి 20 వేల దాకా వాటి ధరలుంటే, కొత్త గేమ్స్‌కి ప్రతిసారీ 1 నించి 3 వేల దాకా అదనపు ఖర్చు.ఇదిలా ఉంటే, మొబైల్ గేమింగ్ మార్కెట్ 2.8 బిలియన్ రూపాయలుగా ఉంది. ప్రస్తుతం ఇది 2015 నాటికల్లా 17.4 బిలియన్లకు చేరుతుందని అంచనా.ఇక పీసీ గేమింగ్, ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్స్ విషయానికొస్తే దీని మార్కెట్ విలువ 1.5 బిలియన్ రూపాయలుగా ఉంది. ఇండియాలో ఇది 2015 నాటకి 6.7 బిలియన్లు కావచ్చని అంచనా.ఆట ఎలా మొదలైందీ?పర్సనల్ కంప్యూటర్ వచ్చిన తొలి రోజుల్లో -్యశ, -్ఘషఘౄశ వంటి సాధారణ స్థాయి గేమ్స్ అందరినీ అలరించాయి. అప్పట్లో గ్రాఫిక్స్ పరిమితంగా ఉండటం జరిగేది. కాలక్రమంలో మెరుగైన గ్రాఫిక్స్‌తో 2డి, యానిమేషన్స్ - ఇలా గేమ్స్ కూడా రూపాంతరం చెందాయి. నేడు ఫొటో రియలిస్టిక్ 3డి గేమ్స్ వచ్చాయి. కంప్యూటర్‌లో ఉండే బీప్‌మనే శబ్దంతో ఆరంభమైన గేమ్స్ నేడు సర్రౌండ్ మ్యూజిక్‌తో అలరిస్తున్నాయి.ఈ పాత గేమ్స్‌లో ఆటను కొద్దిసార్లు గమనిస్తే చాలు. గెలుపు సుసాధ్యమై పోయేది. ఎక్కడ ఏం జరుగుతుందో, శత్రువునెలా జయించాలో ఇట్టే తెల్సిపోయేది. కానీ నేటి గేమ్స్ అలా కాదు. మీ ఆటకు అనుగుణంగా అన్నీ మారిపోతున్నాయి. ఒకసారి జరిగినట్టు ఇంకోసారి జరగట్లేదు.తొలి రోజుల్లో ఒకరు మాత్రమే ఆడగలిగే గేమ్స్ నేడు ఇద్దరు ముగ్గురు కలిసి ఆడేలా రూపొందుతున్నాయి.1958లో Willy Higin Botham అనే ఫిజిక్స్ ఎక్స్‌పర్ట్ తొట్ట తొలి వీడియో గేమ్‌ని రూపొందించాడంటారు. "Tennis' గేమ్ ఈయన రూపొందించిందే. ఇది బ్రూక్ హేవెన్ నేషనల్ లేబొరేటరీలో 2ఏళ్లు ప్రదర్శించారు. అయితే, ఈయనకెలాంటి గుర్తింపూ రాలేదు. 1962లో మస్సాచ్యుసెట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి)లో Steve Russel రూపొందించిన space war తొలి వీడియో గేమ్‌గా గుర్తింపు పొందింది. ఈ గేమ్‌లో రెండు రాకెట్ షిప్‌లు ఒకదానిపై మరోటి టార్పెడోలను ప్రయోగించుకుంటాయి. దీన్ని రూపొందించడానికి 6 నెలలు పట్టింది. ఈ గేమ్ పిడిపి 1 అనే మినీ కంప్యూటర్‌పై రూపొందించాడు.ఎలక్ట్రానిక్ గేమ్స్‌ను ఖరీదైన కంప్యూటర్ల నుంచి ఇంటి ముంగిట్లోకి తెచ్చే ప్రయత్నం 1966లో మొదలైంది. టీవీలపై గేమ్స్ ఆడే సౌకర్యం 1971లో వచ్చింది. Ralph Baerఈ గేమ్స్ రూపకర్త. ఈయన తను రూపొందించిన టెక్నాలజీని 1971లో మాగ్నవోక్స్ అనే సంస్థకు అమ్మివేశాడు. ఆ సంస్థ 1972లో ఒడిస్సీఅనే పేరుతో గేమింగ్ కన్సోల్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది.ఐతే, గేమ్స్ వ్యాపారానికి ఆద్యుడెవరంటే బుష్ నెల్ (Nolan Bushnell) నే చెబుతారంతా. తొలి రోజుల్లో వచ్చిన డఔ్ఘషళ త్ఘీ ఇతణ్ణెంతో ఆకర్షించింది. దానిని పోలిన కంప్యూటర్ స్పేస్అనే ఆటను రూపొందించి, కేవలం ఆ గేమ్‌ను మాత్రమే ఆడగల్గిన రీతిలో ఒక పరికరాన్ని రూపొందించాడు. కానీ ఇది ప్రజాదరణకు నోచుకోలేదు. ఒడిస్సీగేమ్‌ను చూశాక, Tennis గేమ్‌ను ఆధునీకరించి pong గేమ్‌ను రూఫొందించి, pong మెషీన్‌ను ఆవిష్కరింఛాడు బుష్‌నెల్. ఇది బాగా విజయవంతమైంది. అటారీ సంస్థ లక్షన్నర పాంగ్ మెషీన్స్‌ను అమ్మిందా కాలంలోనే.1978లో space invaders గేమ్, వీడియో కన్‌సోల్స్‌ను హోటళ్లకీ, బార్‌కీ, రెస్టారెంట్‌లకీ చేర్చింది. దీని తర్వాత ఎన్నో గేమ్ కన్‌సోల్స్ వచ్చాయి.Pac man, centi-pede, Asteriods, Space Invaders, Tem-Pest వంటి అనేక రకాల గేమ్స్ వచ్చాయి. కాలక్రమంలో ఇవి త్రీడీ రూపాంతరం చెందాయి కూడా.పర్సనల్ కంప్యూటర్ ఆవిర్భావంతో Zork, Wish Bringer లాటి గేవ్స్ ఫాతవే అయినా కొత్త రూపాన్ని సంతరించుకుని వేగవంతమైన అడ్వంచర్స్‌ని తెరపైకి తెచ్చాయి. 1985లో ఇన్‌ఫోకామ్ Zork గేవ్‌ను లక్ష కాపీలకు పైగా అమ్మడంతో వ్యాపారం రూపు మారిపోయింది. Electronic Arts, Sierra వంటి సంస్థలు పుట్టుకొచ్చి, కేవలం గేమ్స్ రూపొందించి అమ్మడంలో బిలియన్ల వ్యాపారం చేయవచ్చని చూపాయి.రోల్ ప్లేయింగ్ గేమ్స్, రమీ లాంటి కార్డ్ గేమ్స్, సోలిటైర్, ఆర్కేడ్, బోర్డ్ గేమ్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ ఇప్పటికీ అందరినీ అలరిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చినవే అడ్వెంచర్ గేమ్స్. 1989లో వచ్చిన ప్రిన్స్ ఆఫ్ పర్షియా గేమ్ అలాటిదే. ఎందరినో ఆకట్టుకొందా గేమ్. రాకుమారుని సాహసం ప్రధానాంశం. దీని తర్వాతే వివిధ రకాల కథాంశాలతో అడ్వెంచర్ గేమ్స్ విడుదలయ్యాయి.అడ్వెంచర్ గేమ్స్ తర్వాత మార్కెట్‌ను కుదిపేసినవే స్ట్రాటజీ గేమ్స్. చెస్, రిస్క్, స్ట్రాటెగో లాంటి ఎత్తుకు పైఎత్తులు వేసే స్ట్రేటజీ గేమ్స్ యూసర్ల మెదడుకు పదును పెట్టడంతో చక్కని ప్రజాదరణ పొందాయి. Ultima, Civilization, Quest సిఠీస్ వంటి గేమ్స్ 20వ శతాబ్దపు చివరి దశకాన్ని ఆన్‌లైన్ గేమింగ్ వైపు తీసుకెళ్లాయి.వీడియో గేమ్ కన్సోళ్ల సంగతేంటి?వీడియో గేమ్స్ మార్కెట్‌దేమీ పూల బాట కాదు. 1985 ప్రాంతంలో ఒక్కసారిగా మార్కెట్ పడిపోయి, అనేక సంస్థలు మూతపడ్డాయి కూడా. ఐతే, ఈలోగా మరింత శక్తివంతమైన ప్రాసెసర్లు రావడం, గ్రాఫిక్స్ మెరుగుపడటంతో నూతన శకం కన్సోల్స్ వచ్చాయి. జపాన్‌కు చెందిన Nintendo సంస్థ రూపొందించిన Super Mario Bros అనే గేమ్ 1985లో 25 లక్షల సెట్లు అమ్ముడైంది. మన దేశంలో అధికారికంగా విడుదలైన తొలి గేమింగ్ కన్సోల్ ఇదే. ఆ తర్వాత కూడా అధికారికంగా వేరే ఏదీ విడుదలవలేదు. దాంతో ఇదే చివరిది కూడా అయింది. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా ఈ గేమ్ కార్టిడ్జ్‌లు అమ్ముడైనాయి. ఆరున్నర కోట్ల కన్సోల్స్ అమ్ముడైనాయి. దీని తర్వాత 1986లో Atari కొత్త కన్సోల్ మార్కెట్‌లోకి వచ్చినా అది పాపులర్ కాలేదు. 1989లో Sega అనే సంస్థ తన తొలి గేమ్ కన్సోల్ Sega Master System ను విఢుదల చేసింది. ఇందులో 2 కార్టిడ్జ్ స్లాట్‌లుండేవి. కొన్ని గేమ్స్ ఆడటానికి త్రీడీ కళ్లద్దాలూ ఇచ్చారు. 1989లో వింటెండో సంస్థ Game Box అనే హేండ్ హెల్డ్‌గేమింగ్ సిస్టంను ఆవిష్కరించింది. చేతిలో ఉంచుకుని ఆడుకోగల్గడంతో ఇది సూపర్ హిట్టయింది. 10 కోట్ల యూనిట్లకు పైగా అమ్ముడైందీ గేమ్ కన్సోల్. దీన్ని పోలిన రీతిలో ఎన్నో సిస్టంలు రూపొందించబడి మన దేశ పురవీధుల్లో సైతం అమ్మడం జరిగింది. 1995 దాకా అసలు వింటెండో, సెగా - ఈ రెండు సంస్థలే గేమింగ్ కనోల్స్ రాజ్యాన్ని 1991లో సోనీ సంస్థతో కలిసి సీడీ టెక్నాలజీని రూపొందించిన ఫిలిప్స్ సంస్థ ఆ సీడీ టెక్నాలజీతో మల్టీ మీడియా సిస్టమ్‌ను రూపొందించింది. ఆడియో, వీడియో, కరోలకే సౌకర్యాలుండేవిందులో. 1992లో దీనే్న 16బిటి గేమింగ్ కన్సోల్‌గా CDi అనే పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. ఐతే, ఇది హిట్టవలేదు. ఇంతలో 1993లో పానసోనిక్ సంస్థ 32 బిట్ గేమింగ్ కన్సోల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది టెక్నాలజీ పరంగా బాగున్నా, ఖరీదెక్కువ కావడంతో విజయవంతం కాలేదు. 1993లో Atari సంస్థ తన కొత్త గేమ్ కన్సోల్ Juguar ను ఫ్రవేశపెట్టి విఫలమైంది. దాంతో గేమింగ్ కన్సోల్ మార్కెట్ నుంచి తప్పుకుంది అటారీ.సోనీ గేమ్1995 దాకా గేమింగ్ కన్సోల్స్ అంటే ఆషామాషీగా ఉండేవి. ఏదో ఒక ట్రెండు గేమ్స్. అదీ రొటీనై పోయాయి. అందువల్ల మార్కెట్ పుంజుకోలేదు. అయితే 1995లో సోనీ మార్కెట్‌లోకి తన కన్సోల్‌ను ప్రవేశపెట్టడంతో పరిస్థితి మారిపోయింది. అదే Play Station . పాలిగాన్ గ్రాఫిక్స్, 32 బిట్ ప్రాసెసర్‌లే కాదు సెగా సంస్థ Saturn కన్నా 30% తక్కువ ధరలో దొరకడం దాని ప్రత్యేకతగా నిలిచింది. దాంతో ఒక్కసారిగా వింటెండో, సెగా సంస్థల ఆధిపత్యం జారిపోయింది. సోనీ గేమింగ్ కన్సోల్ ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది.2001లో మైక్రోసాఫ్ట్ గేమింగ్ కన్సోల్ రంగంపై దృష్టి పెట్టింది. అప్పట్లో శక్తివంతమైన పెంటియం 2 ప్రాసెసర్‌తో కన్సోల్xbox పేరుతో వచ్చింది. ఐతే ఇది కూడా సోనీ గేమింగ్ కన్సోల్ ముందు పరాజయాన్ని పొందాల్సి వచ్చింది. కానీ, రెండో స్థానాన్ని ఆక్రమించింది. అంతదాకా మకుటం లేని మహారాజులా వెలిగిన నింటెండో మూడో స్థానానికి జారిపోయింది. xbox కు పోటీగా వింటెండో 2001లో cube అనే గేమ్ కన్సోల్‌ని తెచ్చింది కానీ పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. అప్పటికీ cube సుమారు రెండున్నర కోట్ల యూనిట్స్ అమ్మిందని వార్త. 2004లో నింటెండో సంస్థ Nintendo DS అనే మరో హేండ్ హెల్డ్ కన్సోల్‌ను విడుదల చేసింది. ఇది సోనీ ప్లే స్టేషన్‌ను మించి అమ్ముడైంది.అటు తర్వాత ఆన్‌లైన్ గేమ్స్, ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందుతున్నాయనిపించడంతో నింటెండో, సోనీ, మైక్రోసాఫ్ట్ సంస్థలు తమ కొత్త కన్సోల్స్ను దీటుగా రూపొందించడంలో నిమగ్నమయ్యాయి. నింటెండో కొత్త కన్సోల్ 2012 జూన్‌లో రావచ్చంటున్నారు. ఇది Xbox 360, PS3 లకన్నా శక్తివంతమైందిగా ఉంటుందిట. ఇదిలా ఉంటే, సోనీ, మైక్రోసాఫ్ట్‌లు మరింత దీటుగా ఘాటుగా స్పందించడానికి 294 దాకా కొత్త కన్సోల్స్‌ను తేవడం లేదని తాజా వార్త.యాండ్రాయిడ్‌పై టాప్ 5 యాక్షన్ గేమ్స్ యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనే్జసే స్మార్ట్ ఫోన్స్‌లో గేమ్స్‌కు కొదవే లేదని చెప్పాలి. అందునా స్మార్ట్ ఫోన్స్‌లో ప్రాసెసర్లూ శక్తివంతం కావడంతో గేమింగ్‌కు ప్రాధాన్యత కూడా పెరిగింది. పాత కాలం కంప్యూటర్లలోలాగా, పాత మొబైల్స్‌లో లాగా కాకుండా స్మార్ట్ ఫోన్స్‌లో గ్రాఫిక్స్ కూడా ఎంతో శక్తివంతంగా ఉండటం వల్ల గేమ్స్ ఆడ్డానికీ చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటున్నాయి. యాండ్రాయిడ్ ఫోన్స్‌లో టాప్ 5 యాక్షన్ గేమ్స్ ఇవీ.1.బ్రదర్స్ ఇన్ ఆర్మ్స్ 2 (Brother in Arms 2)ఇదొక వార్ గేమ్. ఇందులో ఆట ఆడేవారు సైనికునిగా ఉంటారు. వార్ హీరోగా మారతాడు ఆ సైనికుడు. సైనికుడికి రకరకాల వాహనాలనూ వాడే అవకాశం ఉంటుంది. ఒక్కరే ఆడవచ్చు లేదా మిత్రులనూ తోడు చేసుకొని ఆడవచ్చు. బ్లూటూత్ గేమ్ ప్లే ఆప్షన్ ఉంది. దాదాపు 50 మిషన్స్, 5 లొకేషన్స్ (పసిఫిక్, నార్మండీ, నార్త్ అమెరికా, జర్మనీ, సిసిలీ) ఇందులో ఉన్నాయి.2.లైన్ రన్నర్ (Line Runner)పలు రకాల కాంబినేషన్స్‌తో యూసర్ రన్నింగ్ చేస్తూ, దారిలో ఉండే అడ్డంకులను విజయవంతంగా దాటుకుంటూ పోవడమే ఈ గేమ్‌లో ప్రధాన ఆకర్షణ. మొత్తం 10 స్టేజీల్లో దాటుకుంటూ, దొర్లుకుంటూ పోవడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చక్కని కాలక్షేపానికి వివిధ నగరాల బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది.3.కార్టూన్ వార్స్ (Cartoon Wars)పేరుకు తగ్గట్టుగా కార్టూన్స్‌కీ, రాక్షసులకీ మధ్య పోరాటం కోసమే ఈ గేమ్. కార్టూన్ క్యారెక్టర్లు కొనే్నళ్ల బానిసత్వం తర్వాత ఈ రాక్షసులతో పోరాడటం ఈ ఆటలో ప్రధాన అంశం. యూసర్ కార్టూన్ కేరెక్టర్ వైపున ఆడతాడు. మనుష్యుల్ని పోగేసుకోవడం ముందుకు పోవడంలో చాలా ఉత్కంఠతో కొనసాగుతుందీ గేమ్.4.పేపర్ జాంబీ (Paper Zombie) జాంబీ అనే వాటిని చంపుతా పోవడమే ఈ ఆటలో ప్రధానాంశం. పేపర్‌తో తయారైన జాంబీలను చంపాలంటే ఆ జాంబీలను ముక్కలు చేసి చంపాలి. ఓఎస్ లో ఈ గేమ్ ఎంతో పాపులర్. అందుకే దాన్ని యాండ్రాయిడ్ మీదా రూపొందించారు. ఇందులో 70 లెవెల్స్ ఉన్నాయి. మూడు రకాల వెపన్స్ ఉన్నాయి.5.గన్‌బ్రోస్ (Gun Bros)ఇది TOOL (Tyrannical Oppressors of life)కీ FRAGGED (Freakishly Rugged Advanced Genetics Galactic Enforcement Division) కీ మధ్య జరిగే ఫైటింగ్ గేమ్. మీరు FRAGGEDసైనికునిగా ఆటలో పాల్గొని ఎదుటి వారిని చిత్తు చేయడమే ఈ ఆటలో ఆకర్షణ. షూటింగ్, తెలివిగా ముందుకు సాగడం ఇంట్రెస్ట్‌ని కల్గజేస్తాయి.గేమ్స్ భవిష్యత్తేంటి?మన జీవితమంతా ఇంటర్నెట్ మయమై పోయింది. ఒకప్పుడు డెస్క్‌టాప్ నుంచే యాక్సెస్ చేయగల్గుతూంటే, ఆ తర్వాత లాప్‌టాప్‌లూ, నోట్‌బుక్‌లూ వాడుకలోకొచ్చి ఇంటర్నెట్ యాక్సెసింగ్‌ను సులభతరం చేశాయి. మరి నేడో? మొబైల్ ఫోన్స్ రావడం, వాటిలో స్మార్ట్ ఫోన్స్ రావడం, ఐ పాడ్‌లు రావడం - ఇవన్నీ జనాదరణకు నోచుకోవడంతో గేమింగ్ సంస్థలు వీటిల్లోనూ గేమ్స్ ఆడే వీలును కల్గించే పనిలో పడ్డాయి. స్మార్ట్ఫోన్ యూసర్ల అభిరుచులకు అనుగుణంగా గేమ్స్ రూపొందిస్తున్నాయి. గేమ్స్ ఆడే వీలునిచ్చే గేమింగ్ కార్డులూ (వంద రూపాయల నుంచి) విడుదల కాబోతున్నాయి. ఇదింకా 2జి రోజులే.మొబైల్ గేమింగ్ అన్నింటినీ డామినేట్ చేసే రోజులు అతి దగ్గరలో ఉంది. దీని మార్కెట్ వాటా 67% పైచిలుకే. హేండ్ సెట్స్ చవకైతే ఈ గేమింగ్ మరింత బలపడి, అన్నిటికన్నా బలమైన బిజినెస్గా మారిపోనుంది.రాబోయే రోజుల్లో 3జీ, 4జీ ఆధారిత మొబైల్స్ స్మార్ట్‌గా రాబోతున్నాయి. దీంతో మొబైల్ ఫోన్‌ల వాడకం పెరగడమే కాదు, సోషల్ గేమింగ్ వాడకం కూడా బాగా పెరగనుంది. రిలయన్స్ లాటి భారీ సంస్థలూ సోషల్ గేమింగ్ రంగంలో పెద్ద ఎత్తున ప్రవేశించే ప్రయత్నాలు చేస్తున్నాయి. భవిష్యత్‌లో ఏవౌతుందో వేచి చూడాల్సిందే. * ====ఆన్‌లైన్ గేమ్ - సోషల్ గేమింగ్ ఆన్‌లైన్ గేమ్ అంటే, నేరుగా సదరు గేమింగ్ వెబ్‌సైట్ కెళ్లి గేమ్‌ను ఎంచుకొని ఆడుకోవడం. సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా ఈ గేమ్స్ ఆడేట్లయితే, నెట్‌వర్క్‌లో మన మిత్రులతో కలిసి ఆడుకోవచ్చు. ఈ సోషల్ గేమింగ్‌లో చాలా వాటిల్లో గెలుపూ, ఓటమీ అంటూ వుండవు. ఇవి ఇతర గేమ్స్‌లాకాక నిమిషాలూ, గంటలూ కాదు. ఏకంగా నెలలూ, సంవత్సరాల తరబడి ఆడుకోవచ్చు. ఈ సోషల్ గేమింగ్స్ మీద పిల్లలకన్నా పెద్దలే ఆసక్తి చూపడం గమనార్హం. ఇంకో సంగతేమిటంటే, సోషల్ గేమింగ్ నేడు కోట్ల విలువ చేసే వ్యాపారం. భారతదేశంలో 52 లక్షల పైచిలుకు ఇంటర్నెట్ యూసర్లుంటే, వీరిలో అధిక శాతం సోషల్ నెట్‌వర్క్ మెంబర్స్. దీనికితోడు మొబైల్ యూజర్స్ వేర్. ఇంత మంది యూజర్స్ ఉండటంవల్ల వ్యాపారస్థులకూ ఇది వ్యాపార మాధ్యమాలుగా తయారైంది. ఉదాహరణకు, మహేంద్ర సంస్థ తన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను, స్కూటర్లను ప్రఖ్యాత గేమింగ్ సైట్ అయిన Zapak లో ప్రకటించడం వాత్రమే కాదు. వాటిని డ్రైవ్ చేస్తున్న అనుభూతినిచ్చేలా ఒక గేమ్‌నూ ఏర్పాటు చేసింది. ఇదే రీతిలో యాక్స్ పెర్‌ఫ్యూమ్ తయారీ సంస్థ కూడా తన ఉత్పత్తులను గేమింగ్‌లో భాగంగా చేసింది. ప్రపంచంలో అగ్రశ్రేణి గేమింగ్ సంస్థలన్నీ నేడు సోషల్ నెట్‌వర్కింగ్‌లో గేమ్స్ ఆడుకునేలా రూపొందించడంలో నిమగ్నమై పోయాయి. Farm ville, Mafia wars, Frontier Ville, Cafe world, City Ville, Zynga Poker వంటి గేవ్స్ ఇఫ్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.యాంగ్రీ బర్డ్స్ - మొబైల్ గేమ్స్‌లో మేటి యాంగ్రీబర్డ్స్ అనేదొక స్ట్రేటజీ పజిల్ గేమ్. ఇది ముఖ్యంగా మొబైల్ యూసర్లను ఉద్దేశించే రూపొందించింది. ఫిన్నిష్ కంప్యూటర్ గేమ్ డెవలపర్ రొవియో మొబైల్సంస్థ రెక్కల్లేని పక్షుల స్టైలిష్ బొమ్మలను చూచి స్ఫూర్తిని పొంది ఈ గేమ్‌ను రూపొందించింది. ఇది తొలిగా 2009 డిసెంబర్‌లో ఆపిల్ జ్యఒ కోసం రూపొందించి ఆపిల్ అప్స్ స్టోర్‌లో ఉంచగా 12 మిలియన్ కాపీలు అమ్ముడుపోయింది. దీన్ని టచ్ స్క్రీన్ స్మార్ట్ మొబైల్స్‌లో ఆడేందుకు వీలుగా కూడా వెర్షన్స్‌ను రూపొందించింది రోవియో సంస్థ. యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనే్జసే మొబైల్స్‌లో కూడా పనిచేసే రీతిలో వెర్షన్స్ వచ్చాయి. దాంతో పెరిగిన ప్రజాదరణతో పీసీల్లోనూ, గేమింగ్ కన్‌సోల్స్‌లోనూ పనిచేసే వెర్షన్స్‌ను విడుదల చేసింది రోవియో. 2010లో అదో బిగ్ సూపర్ డూపర్ హిట్. దాదాపు (అన్ని రకాల వెర్షన్లూ కలిపి) 500 మిలియన్ల డౌన్‌లోడ్స్‌ను చూసిందీ గేమ్. తొలి వెర్షన్ రూపకల్పనకు 1,00,000 పౌండ్లు పైచిలుకే ఖర్చు అయ్యింది. తర్వాతి రోజుల్లో దానికి ఎనె్నన్నో రెట్లు లాభాలు ఆర్జించిందా సంస్థ.2010లో ఫేస్‌బుక్ కోసం కూడా యాంగ్రీ బర్డ్స్ గేమ్‌ను రూపొందించే ప్రయత్నంలో ఉండింది రోవియో. 2011 నాటికి గానీ అది పూర్తి కాలేదు. 2011 ఏప్రిల్‌కు బీటా టెస్టింగే అయినా, అసలు వెర్షన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యింది. తొలి ios వెర్షన్‌లో poached eggs అనే సింగిల్ ఎఫిసోడ్‌తో రూపొందిన ఈ గేమ్‌లో 3 థీమ్ అధ్యాయాలూ, 21 లెవల్సూ ఉండేవి. డిసెంబర్ 2010 నాటికి ఐదు ఎపిసోడ్‌లు, 15 థీమ్స్ అందుబాటులోకి వచ్చాయి. 2011 చివరలో mighty eagle ఫలు వెర్షన్‌లో లభించసాగింది. 2011 జూన్‌లో mine & dine అనే ఆరో ఎపిసోడ్ 15 కొత్త మైనింగ్ థీమ్స్‌తో వచ్చింది. అదే గేమ్ 2011 ఆగస్టుకల్లా మరో (చెరి) 15 లెవెల్స్ ఉండే రెండు అధ్యాయాలను జోడించింది రోవియో. 2011లో ఐఫోన్ గేమ్స్‌లో మేటి అనిపించుకుంది. 2010 ఫిబ్రవరిలో స్పెయిన్‌లో జరిగిన 6వ అంతర్జాతీయ మొబైల్ గేమింగ్ అవార్డులలో బెస్ట్ కాష్యువల్ గేమ్గా నామినేషన్ పొందింది. 2010 సెప్టెంబర్‌లో బెస్ట్ ఐ ఫోన్ గేమ్గా అవార్డును పొందింది. 2011 ఏప్రిల్‌లో యుకెలలో జరిగిన appy awards లో దీనికి అప్లికేషన్ ఆఫ్ ది ఇయర్అవార్డుతోపాటు బెస్ట్ గేమ్ అప్లికేషన్అవార్డు లభించింది.యాక్షన్ గేమింగ్ కోసం ఫ్రీ గేమ్స్ కంప్యూటర్ యాక్షన్ గేమ్స్ కోసం అబౌట్.కామ్ సంస్థ ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌నే ఏర్పాటు చేసింది. ఇందులో వందల కొద్దీ గేమ్స్ అందిస్తోంది. ఎ టు జెడ్ గేమ్స్ జాబితా కావాలంటే http://compactiongames.about.com/ ఛూడొచ్చు. ఇందులో త్రీడి డెసర్ట్న్,్ర ఎర్‌స్ట్రైక్ త్రీడి, బాబిలోన్, బ్లేడ్, కార్విన్, కేవ్‌షిప్, ఛాంప్ కోంగ్, కారిడార్ ఆఫ్ పవర్, క్యూబ్ డార్క్ వార్స్ 2, ధూమ్ 95, డ్రాగన్ కాసల్, డంజన్ రన్నర్స్, ఫార్మిడో, గెలాక్సీ ఆర్కేడ్ 2, జీనీర్యాలీ, గాడ్ ఆఫ్ థండర్, గ్రాండ్ తెఫ్ట్, హైవే పర్‌సూట్, ఐసీ టవర్స్, ఐలాండ్ వార్స్, జేట్‌ప్యాక్, కింగ్స్ క్వెస్ట్ 1,2, మాడర్న్ వార్, పాక్‌మాన్ త్రీడి, ఫోబియా 3, ప్రిన్స్ ఆఫ్ పర్షియా, క్వేక్, రేసర్, రిటర్న్ టు కాసల్, షావోలిన్ సోల్జర్, స్టేస్‌జాక్, స్పైహంటర్, స్టార్‌వార్స్, స్ట్రీట్ ఫైటర్, సూపర్ మారియో, టెర్రిఫైర్, యుఎఫ్‌ఒ 2000, ఎక్స్ క్లాసిక్ కొన్ని.ఫేస్‌బుక్‌లో పాపులర్ గేమ్ - ్ఫర్మ్ విల్లే్ఫర్మ్‌విల్లేఅనే గేమ్ ఒక రియల్ టైమ్ సిమ్యులేషన్ గేమ్. ఈ ఆట మొదలుపెట్టగానే మనకు కొంత పొలాన్నీ, కొంత డబ్బునీ ఇవ్వడం జరుగుతుంది. ఆనక ఆ పొలం దున్ని, మార్కెట్‌కెళ్లి నచ్చిన విత్తనాలు కొని ఆ పొలంలో నాటాలి. అలా నాటిన విత్తనాలు మొక్కలై కోతకు వచ్చేందుకు సమయం, కోతకు వచ్చిన పంట అమ్మకానికో రేటూ ఉంటాయి. వాటిని బట్టి, మీ పెట్టిన ఖర్చు బట్టీ డబ్బు (పాయింట్సేనండోయ్) ఆదాయంగా వస్తుంది. వీటినే ్ఫర్మ్ కాయిన్స్అంటారు. ఈ గేమ్ ఫేస్‌బుక్‌లో వుండటంవల్ల మన సోషల్ నెట్‌వర్క్‌లోని స్నేహితులను, మన ఇరుగు పొరుగును చేర్చుకొని వారితో మన పొలం అవసరాలు తీర్చేలా, మనం వారి పొలం అవసరాలు తీర్చేలా చేసుకోవచ్చు.సోనీ నించి వచ్చిన గేమ్ కన్సోల్స్1994 ప్లే స్టేషన్2000 పిఎస్ 1, ప్లే స్టేషన్ 2 2003 పిఎస్ ఎక్స్ (డివిఆర్)2004 ప్లే స్టేషన్ స్లిమ్ లైన్2006 ప్లే స్టేషన్ 3 2009 ప్లే స్టేషన్ 3 స్లిమ్ మైక్రోసాఫ్ట్ నించి వచ్చిన గేమ్ కన్సోల్స్2001 ఎక్స్ బాక్స్2005 ఎక్స్ బాక్స్ 360 2010 ఎక్స్ బాక్స్ 360 ఎస్ మరిన్ని ఫ్రీ గేమ్‌లింక్స్ ఇవీ:ఇంటర్నెట్‌లో చాలా గేమ్స్ ఉన్నాయి. వీటిలో ఫ్రీగా దొరికేవి కూడా ఉన్నాయి. Scubasteva అనే గేమ్ అండర్ వాటర్ గేమ్. ఇది 60 లెవెల్స్‌లో ఆడొచ్చు. దీన్ని కావాలనుకునేవారు http://www.freegamepick.com అనే URL ఛూడొచ్చు.అలాగే, Great Secrets: Davinci అనే మరో గేమ్ ఉంది. దాగున్న ఆబ్జెక్ట్‌ను వెదికి పట్టుకోవడం. దానికి లియొనార్డో డావిన్సీ డైరీలో క్లూవెదుక్కోవడం. ఆ పేజీల్లో మర్మాన్ని ఛేదించడం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. దీనికీhttp://www.freegamepick.com/ ఛూడొచ్చు. ఇందులో దాదాపు 1000 ఆబ్జెక్టులూ, 70కి పైగా లెవెల్సూ, పజిల్సూ ఉన్నాయి. Mayan Maze, Free Billiards 2008 అనే గేమ్స్ (ఫల్ వెర్షన్) కూడా ఈ freegamepick.com సైట్‌లో ఉన్నాయి. Aerial Fire, 8 ball Frenzy అనే గేమ్స్ ఉన్నాయి. వీటిలో 8 ball Frenzy ప్రపంచంలోనే బెస్ట్ బిలియర్డ్ గేమ్. Funny Bullets అనేది త్రీడి గేమ్. ఇది యాక్షన్ గేమ్. Lost Treasures of ER Dorado అనేది 77 లెవెల్స్‌లో, 9 లొకేషన్స్‌లో ఆడే రీతిలో ఉండే చక్కని గేమ్.ఇవేకాదు game.top.com సైటులోreal racing, aboo, star sword గేమ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.

ఫ్రీ గేమ్ లింక్స్, లిస్ట్స్


* Free Game of the Week Newsletter http://compactiongames.about.com/c/ec/1.htm


 Free Game lists




కొన్ని ఫ్రీ గేమ్స్ వెబ్‌సైట్లు

http://www.freeonlinegames.com http://www.freeonlinegames.in/ http://www.gamepuma.com/ http://www.freegamesmedia.com/ http://www.games2win.com/en/ www.gamenode.com www.game.co.in http://www.dailygames.com www.online-games-zone.com http://crickrock.com/ www.thegamebox.com http://www.free-online-games-to-play.net/